Begin typing your search above and press return to search.
ఫ్యూచర్ మాస్ సూపర్ స్టార్ రౌడీ స్టారేనా?
By: Tupaki Desk | 17 May 2022 11:41 AM GMTఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. తన క్రేజ్ నే బ్రాండ్ ఇమేజ్ గా మలుచుకుని ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా యూత్ లో భారీ క్రేజ్‌ని ఫాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో చాలా వరకు ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి.
ఆ తరువాత చేసిన చిత్రాలు కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ని రోజు రోజుకీ పెంచుతూ పోయాయే కానీ ఎక్కడా తగ్గించలేదు. మెగాస్టార్ చిరంజీ, సూపర్ స్టార్ మహేష్ బాబు ల తరువాత థమ్స్ అప్ యాడ్ ని సొంతం చేసుకున్న హీరోగా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు. చేసింది కేవలం 9 సినిమాలే అందులో క్రేజీ హిట్ లు, బ్లాక్ బస్టర్ లు తక్కువే అయినా విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. అదే అతన్ని థమ్స్ అప్ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యేలా చేసింది.
ప్రస్తుతం 'లైగర్' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ ఇదే సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని కూడా టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ మూవీ ఆగస్టులో ఏకంగా ఐదు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, చార్మిలతో కలిసి పూరి జగన్నాథ్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్తులో ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది.
తాజాగా ఈ మూవీ గ్లింప్స్, ఖుషీ మోషన్ పోస్టర్ 24 గంట్లో సాధించిన రికార్డ్ స్థాయి వ్యూస్ ని చూస్తే ఫ్యూచర్ మాస్ సూపర్ స్టార్ రౌడీ స్టారేనా? అనే భావన ప్రతీ ఒక్కరిలోనూ కలగక మానదు. లైగర్ గ్లింప్స్ 24 గంటల్లోనే ఇండియాలో అత్యధికంగా వీక్షించి 16 మిలియన్ ల వ్యూస్ ని సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఇటీవల శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ 'ఖుషీ'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ని సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
24 గంటల్లోనే 'ఖుషీ' మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ 24 గంటల్లోనే 2.59 మిలియన్ ల వ్యూస్ ని సాధించి అత్యధిక వ్యూస్ ని రాబట్టిన మోషన్ పోస్టర్ లలో 3వ స్థానాన్ని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ క్రేజ్ మాస్ ఫాలోయింగ్ వున్న వాళ్లకే సాధ్యం అవుతుంది. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ ఫ్యూచర్ మాస్ సూపర్ స్టార్ గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. అతని దూకుడుని ఎవరూ ఆపలేరని కూడా స్పష్టం అవుతోందని ఇన్ సైడ్ టాక్.