Begin typing your search above and press return to search.

గోవింద్ నామ్ మేరా డీజే టిల్లుకి కాపీ నా?

By:  Tupaki Desk   |   17 Dec 2022 12:04 PM GMT
గోవింద్ నామ్ మేరా డీజే టిల్లుకి కాపీ నా?
X
విక్కీ కౌశ‌ల్..కియారా అద్వాణీ...భూమీ ప‌డ్నేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన `గోవింద్ నామ్ మేరా` భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ కి డివైట్ టాక్ వ‌స్తుంది. విమ‌ర్శ‌కులు మెచ్చన చిత్రంగా నిల‌వ‌న‌ప్ప‌టికీ.. ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ని బాగానే న‌వ్విస్తుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు ప‌ర్వాలేద‌నిపిస్తుంది. పోటీగా ఇత‌ర సినిమాలు లేక‌పోవ‌డం తో ఇదే అతి పెద్ద ఎంట‌ర్ టైన్ మెంట్ గా క‌నిపిస్తుంది. అయితే ఈసినిమా తెలుగు లో రిలీజ్ అయిన డీజే టిల్లుకి కాపీ క్యాట్ లా ఉంద‌ని విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. సినిమాలో చాలా స‌న్నివేశాలు డీజేటిల్లుని పోలిన‌ట్లు సోష‌ల్మీడియాలో నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే కొన్ని రివ్యూల్లోనూ ఇది కనిపించింది.

మూల కథాంశం - కథానాయిక పాత్రతో పాటు స్క్రీన్ ప్లే లో మలుపులు అన్ని `డీజే టిల్లు` గుర్తు చేస్తాయి. డీజే టిల్లులో హీరోయిన్ భర్త హత్య గురైతే... `గోవింద నామ్ మేరా`లో హీరో భార్య హత్యకు గుర‌వుతుంది. కథా ప్రవాహం దాదాపు డీజే టిల్లుకి సమానంగా ఉంటుంది. హీరోయిన్ హీరోని ఓవర్-స్మార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరికి ఆమె తన కంటే సూపర్ స్మార్ట్ అయిన హీరో నుంచి ట్విస్ట్ కిగుర‌వుతుంది. అలాగే సమాధి తవ్వే సన్నివేశం.. తెలివైన హీరోయిన్‌కి హీరో గుణపాఠం చెప్పే విధానం.. ఆమె తనను ఎలా మోసం చేసిందో చెప్పిన విధానం. ఓ పోలీసు (బ్రహ్మాజీ క్యారెక్టర్).. డ్రగ్స్ పంపిణీ వంటివి డీజే టిల్లు నుంచి స్పూర్త‌గా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ సంద‌ర్బంగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది ఓ ఫ్రెంచ్ చిత్రం నుండి కాపీ అని అంటున్నారు. `గోవింద నామ్ మేరా` డీజే టిల్లుకి కాపీ అయితే...టిల్లు బాబు ప్రెంచ్ సినిమాకి కాపీ అవ్వొచ్చుగా అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వు తోంది. మ‌రి ఏది కాపీ అన్న‌ది ఖ‌రారు కావాలి. ఇటీవ‌ల కాలంలో కొన్నిసినిమాల‌కు ప్రెంచ్ చిత్రాలు స్పూర్తి అని అధికారికంగా కొంద‌రు ముందే చెప్పేస్తున్నారు.

మ‌రి కొంత మంది మాత్రం విష‌యం దాచిపెట్టి..సంద‌ర్భం వ‌చ్చిన త‌ర్వాత రివీల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు మాత్రం విభిన్నమైన సెటప్‌లతో మభ్యపెట్టబడిన ఒకే విధమైన ఆలోచనలు. డిజె టిల్లును సిద్ధు జొన్నలగడ్డ రచించగా... గోవింద నామ్ మేరా కు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.