Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం అతనేనా..?
By: Tupaki Desk | 16 March 2022 3:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
మన రాత చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ అందమైన ప్రేమ కథతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు రాధాకృష్ణ. యూరఫ్ బ్యాక్ డ్రాప్ లో విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరించారు. బ్యూటిఫుల్ లొకేషన్స్ - మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ - కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి.
అయితే ప్రభాస్ గత సినిమాల మాదిరి యాక్షన్ లేకపోవడంతో మెజారిటీ ఫ్యాన్స్ 'రాధేశ్యామ్' సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. రివ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లో ఈ పీరియాడికల్ డ్రామా మంచి వసూళ్ళు రాబట్టింది.
'రాధేశ్యామ్' నిర్మాతలు నాన్-థియేట్రికల్ బిజినెస్ మరియు ఇప్పటి వరకు వచ్చిన థియేట్రికల్ కలెక్షన్స్ తో సేఫ్ జోన్ లోకి వచ్చారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే సినిమా బడ్జెట్ కంట్రోల్ చేసి ఉంటే లాభాలు కూడా వచ్చి చేరేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమాలో విజువల్స్ అంత బాగుండటానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ - సెట్స్ ఎంత కారణమో.. బడ్జెట్ పెరగడానికి కూడా అంతే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి కోసమే నిర్మాతలు దాదాపు 75 కోట్లు ఖర్చు చేశారని టాక్ ఉంది. ఓ కొత్త ప్రపంచాన్ని కళ్లముందు సృష్టించిన ఆర్ట్ డైరెక్టర్ ఆర్ రవీందర్ పనితనాన్ని అభినందించాల్సిందే.
కాకపోతే ఇటలీ నేపథ్యంలో కథ సాగుతుందని అక్కడికే వెళ్లి సెట్స్ నిర్మాణం చేయడం.. కరోనా పాండమిక్ వల్ల షూటింగ్ చేయడం కుదరకపోవడంతో ఇటలీనే హైదరాబాద్ లో ర్రీక్రియేట్ చేయడం వల్ల 'రాధేశ్యామ్' మేకర్స్ కు అదనంగా బడ్జెట్ పెరిగిందని టాక్ నడుస్తోంది.
'రాధేశ్యామ్' సినిమా కోసం హైదరాబాద్ లో దాదాపు 100 సెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ట్రైన్ సెట్ - రైల్వే స్టేషన్ - పెద్ద షిప్ - కాఫీ షాప్ - హీరోయిన్ హౌస్ - హాస్పిటల్ సెట్.. ఇలా ఇటలీ - జార్జియాలలో చేయాల్సిన సీన్స్ కి సంబంధించిన ప్రదేశాలను సెట్స్ రూపంలో సృష్టించారు.
భారీ ఖర్చు చేసి సెట్స్ నిర్మించడానికి యూవీ నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వీటికే 75 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఇందులో ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ తాను వేసిన సెట్స్ లో చాలా డిటైలింగ్ చేయడం వల్ల బడ్జెట్ రెట్టింపు అయిందనే కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
కరోనా వల్ల 'రాధే శ్యామ్' సినిమా బడ్జెట్ 50 కోట్ల వరకు పెరిగిందని తెలుస్తోంది. అయితే అందులో అధిక భాగం ఆర్ట్ డైరెక్టర్ అవాంఛనీయంగా ఖర్చు చేయించిందే అనే టాక్ నడుస్తోంది. కథకు అవసరం కాబట్టే భారీ స్థాయిలో సెట్స్ నిర్మాణం చేయాల్సి వచ్చింది.. దర్శకనిర్మాతలు అందుకే వెనకడలేదని.. అందులో అతని తప్పు ఏముందని సమర్ధించేవారు కూడా లేకపోలేదు.
కొందరు అతని పనితనాన్ని మెచ్చకుంటుంటే.. మరికొందరు మాత్రం బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణమయ్యాడని విమర్శిస్తున్నారు. ఏదైతేనేం నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆర్ రవీందర్.. 'రాధే శ్యామ్' సినిమా విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారనేది అర్థం అవుతోంది.