Begin typing your search above and press return to search.
ఆ సినిమాలో హీరోని మార్చేస్తున్నారా?
By: Tupaki Desk | 13 Sep 2022 11:30 PM GMT'లైగర్' షాక్ నుంచి పూరి అండ్ కో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నష్టాల్ని భర్తీచేసే కార్యక్రమం మొదలైనట్లు తెలుస్తోంది. ఇది యూనిట్ మొత్తానికి ఊహించని షాక్. ఏదో అనుకుంటే? ఇంకెదో జరిగింది. అప్పుడప్పుడు ఇలాంటి తప్పవు. ఇలాంటి వాటిని ఎన్నో దాటుకుని పూరి నిలబడ్డాడు. ఇలాంటి గాలి వానల్ని ఆయన ఏమాత్రం లెక్క చేయడు.
కాకపోతే అనుకున్నవి వెనుకా? ముందు అవుతుంటాయి. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' విషయంలో అదే జరిగుతుంది. 'లైగర్' ఇంపాక్ట్ జనగణమనపై పడింది. దీంతో ఉన్నపళంగా జేజీఎమ్ ని పక్కనబెట్టేసారు. విజయ్ దేవరకొండ హీరోగా 30 శాతం షూటింగ్ పూర్తి చేసారు. కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని మీడియాలో ఇప్పటికే క థనాలు వెలువడ్డాయి.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్టేట్ వైరల్ అవుతుంది. ఇందులో హీరోగా నటిస్తోన్న విజయ్ దేవరకొండని తప్పిస్తున్నట్లు ఓ రూమర్ వినిపిస్తుంది. ఆయన స్థానంలో మరో హీరోని తీసుకుని మళ్లీ మొదటి నుంచి షూటింగ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు గుస గుస వినిపిస్తుంది. ఆ కారణంగానే పూరి ప్రాజెక్ట్ ని ఆపేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.
మరి దీని వెనుక వాస్తవాలు ఏంటి? అన్నది తెలియాలి. నిజంగా విజయ్ ని తప్పిస్తున్నారా? లేక ఆయనే తప్పుకుంటున్నాడా? అన్నది తెలియాలి. విజయ్ హీరోగా తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా వైడ్ ఎలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా వెచ్చించారు. కానీ వసూళ్లు అందులో సగం కూడా రాలేదు.
దాదాపు ముప్పావు వంతుకు పైగా నష్టాలు భరించాల్సిన పరిస్థితి దాపరించింది. పూరి బ్రాండ్..విజయ్ పాన్ ఇండియా క్రేజ్ ఏ మాత్రం ఈ సినిమాకి పనికి రాలేదు. రిలీజ్ కి ముందు హడావుడి తప్ప! లైగర్ కి ఆ క్రేజ్ తో ఒరిగిందేం? లేదు. మరి వీటన్నింటిని బేరీజు వేసుకుని జేజీఎమ్ విషయంలో నిర్ణయాలు మార్చుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాలి.
కానీ 'లైగర్' సినిమాతో పూరి-ఛార్మీకి విజయ్ మంచి స్నేహితుడైపోయాడు. ముగ్గురు పాలు..నీళ్లలో కలిసి పోయారు. ఆ బాండింగ్ తోనే మరో ఆలోచన లేకుండా జేజీఎమ్ ని ప్రకటించారు. మరి తాజా కథనాలకి ఎలాంటి బధులు దొరుకుతుందో చూడాలి. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషీ' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.