Begin typing your search above and press return to search.

ఇదెలా వర్కవుట్ అవుతుంది విష్ణు

By:  Tupaki Desk   |   22 April 2019 11:09 AM IST
ఇదెలా వర్కవుట్ అవుతుంది విష్ణు
X
ఐదు వందలకు పైగా సినిమాలు చేసిన హీరోగా ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటి వారసుడిగా మంచు విష్ణు పరిశ్రమలో అడుగు పెట్టి 16 ఏళ్ళు దాటింది . మొదటి సినిమా విష్ణుతో మొదలుపెట్టి గత ఏడాది వచ్చిన ఆచారి అమెరికా యాత్ర దాకా కెరీర్ మొత్తం అపజయాలే ఎక్కువగా ఉన్నా టైం రాకపోదా అంటూ ఎదురు చూస్తూనే ఉన్నాడీ మంచు హీరో.

మధ్యలో డీ-దేనికైనా రెడీ లాంటి సక్సెస్ లు ఉన్నప్పటికీ తర్వాత వచ్చినవేవి కనీస స్థాయిలో ఆడకపోవడంతో మార్కెట్ బాగా డేంజర్ లో పడింది. కొత్త సినిమా ఓటర్ ని రిలీజ్ చేయలన్నా పరిస్థితులు అనుకూలంగా లేవంటేనే అర్థం చేసుకోవచ్చు ఇమేజ్ ఎంత ట్రబుల్ లో ఉందో. ఇవన్ని ఇండస్ట్రీలో మామూలే కాని విష్ణు ఇప్పుడు 70 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప చేసేందుకు రెడీ అవుతుండటమే అందరిని ఆశ్చర్యపరుస్తోంది

శివ భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా భరణి దర్శకత్వంలో రూపొందబోయే మూవీకి కావాల్సిన లొకేషన్స్ కోసం విష్ణు ఇప్పటికే విదేశాల్లో వేట సాగిస్తున్న సంగతి తెలిసిందే. తన మీద ఇంత పెట్టుబడి ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో లెక్కలు వేసుకోకుండా విష్ణు ఇంత ధైర్యం చేస్తున్నాడు అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.

ప్రభాస్ తో దీన్ని తీయాలని తలచి కృష్ణంరాజు అంతటి వారే వెనుకడుగు వేశారు. మరి విష్ణు ఇలాంటి రిస్కీ సబ్జెక్టుతో అందులోనూ దైవ భక్తికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకోవడం అంటే ఆలోచించదగిన విషయమే. బయట ఎక్కడో ఫంక్షన్స్ లో కన్పించడం తప్ప విష్ణు మీడియాకు దొరకడం లేదు. ఈ కన్నప్ప విశేషాలు షేర్ చేసుకోవడానికైనా వస్తాడేమో వేచి చూడాలి