Begin typing your search above and press return to search.

మిస్ ఫైర్ అవుతున్న దాస్ వ్యవహారం

By:  Tupaki Desk   |   3 Jun 2019 6:02 AM GMT
మిస్ ఫైర్ అవుతున్న దాస్ వ్యవహారం
X
కొత్త సినిమాల పబ్లిసిటీకి సంబంధించిన పరిణామాలు చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని అయోమయం నెలకొంది. నిన్న తన ఫలక్ నుమా దాస్ ని టార్గెట్ చేసి ఓ క్రేజీ యూత్ హీరో ఫ్యాన్స్ నెగటివ్ ప్రాపగండా చేస్తున్నారని పోస్టర్లు కూడా చించుతున్నారని విశ్వక్ సేన్ పోస్ట్ చేసిన ఇన్స్ టాగ్రామ్ వీడియో పెద్ద దుమారమే రేపింది. అతని తీరు పై వాడిన బాషపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ట్రాల్స్ కూడా స్టార్ అయ్యాయి.

ఈ నేపధ్యంలో అసలు ఇదంతా ఎందుకు జరిగిందో స్వయంగా వివరణ ఇస్తానని విశ్వక్ చెప్పడంతో ఈ రోజు ప్రెస్ మీట్ కి ప్రాధాన్యత ఏర్పడింది. ఈలోగా కొన్ని న్యూస్ ఛానల్స్ ఇది విజయ్ దేవరకొండ ఫాన్స్ కు విశ్వక్ సేన్ కు మధ్య జరుగుతున్న వార్ గా ఓవర్ గా ప్రోజెక్ట్ చేయడంతో వ్యవహారం ముదిరిపోయింది. ఎన్ని చెప్పుకున్న విశ్వక్ సేన్ వాడిన పదాలు మాత్రం అభ్యంతపెట్టేవే. అందుకే పబ్లిక్ గా సారీ చెప్పి మరీ కారణం వివరించాడు. ఇక్కడ మరో కోణం ఉంది. కంటెంట్ ఉండాలే కాని విజయ్ దేవరకొండ ఫాన్సో ఇంకొకరో కాదు ఆ దేవుడే దిగి వచ్చినా సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది.

ఫేస్ బుక్ ప్రచారం చేసినంత మాత్రాన పోస్టర్ చింపేస్తే సినిమా ఫ్లాప్ కాదు. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి విశ్వక్ సేన్ ఇంతలా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎగ్జైట్ మెంట్ ఉండొచ్చు కాని అది డ్యామేజ్ చేసే రీతిలో సాగరాదు. తన సినిమా ద్వారా ఓ 80 ఆర్టిస్టులను పరిచయం చేసానని చెబుతున్న విశ్వక్ సేన్ కేవలం ఆ కారణంగా సినిమా చూడమనటమూ సరి కాదు. విషయం ఉంటె జనం నెత్తి మీద పెట్టుకుంటారు. అంతే తప్ప ఇలా లేనిపోని వివాదాలతో వచ్చే ప్రచారం కన్నా జరిగే నష్టమే ఎక్కువ ఉంటుందని గుర్తిస్తే బెటర్ దాసూ