Begin typing your search above and press return to search.
కొరటాల సెంటిమెంట్ ని హీరోలు దెబ్బేసేస్తున్నారా?
By: Tupaki Desk | 23 Nov 2022 2:30 PM GMTకొరటాల శివ చాలా తక్కువ సమయంలోనే స్టార్ దర్శకుల సరసన స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.' మిర్చి'.. 'శ్రీమంతుడు' ..'జనతా గ్యారేజ్' తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి కొరటాల అంటే ఏంటో? చూపించారు. అటుపై 'భరత్ అనే నేను'తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఊపులో ముందుకు సాగితే డబుల్ హ్యాట్రిక్ నమోదు ఖాయమనుకున్నారంతా? కానీ ఒక్కసారిగా 'ఆచార్య' ప్లాప్ తో సీన్ టర్న్ అయింది.
ఆ తర్వాత కొరటాల ఎలాంటి ఫేజ్ ని చేసారో? తెలిసిందే. ఆచార్య ముందు వరకూ ఉన్న సక్సెస్ లన్నింటిలోనూ రాక్ స్టార్ దేవిప్రసాద్ సైతం కీలక పాత్ర పోషించారు. ఆ సినిమాలు మ్యూజికల్ గానూ పెద్ద విజయాన్ని సాధించాయి. దీంతో కొరటాలకి డీఎస్పీ సెంటిమెంట్ గా మారిపోయారు. సుకుమార్ తరహాలోనే డీఎస్పీ కొరటాలకి ఓ బ్రాండ్ గా మారిపోయారు.
కానీ అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రోత్భలంతో 'ఆచార్య' లోకి సంగీత దర్శకుడు మణిశర్మ దిగారు. వాస్తవానికి డీఎస్పీనే కొనసాగించాలని కొరటాల భావించినప్పటికీ చిరు మాట కాదనలేక మణిశర్మని సీన్ లోకి తేవాల్సి వచ్చింది. అప్పటికే చిరుకి ఎన్నో మ్యూజికల్ హిట్లు అందించిన సెంటిమెంట్ తోనే మెగాస్టార్ ఆయన్ని రంగంలోకి తెచ్చారు.
కానీ ఈసారి వర్కౌట్ అవ్వలేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ మూవీ 30వ చిత్రం విషయంలో కూడా కొరటాల సెంటిమెంట్ ని హీరో లైట్ తీసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ చిత్రానికి తమిళ యువ కెరటం అనిరుద్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ముందుగా దేవిశ్రీనే అనుకున్నారుట. కానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం సహా పలు కారణాలుగా డీఎస్పీ స్థానంలో అనిరుద్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇందులో తారక్ ప్రమేయమే ఎక్కువగా ఉందని గుస గుస వినిపిస్తుంది. సంగీతంలో తారక్ కొత్తదనం కోరుకుంటున్నారుట. 'విక్రమ్' సినిమాకి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి తారక్ ఫిదా అయ్యారుట.
ఈ నేపథ్యంలో మన సినిమాకి మ్యూజిక్ ఇన్నోవేటివ్ గా ఉండాలని తారక్ భావించి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా మరోసారి కొరటాల సెంటిమెంట్ ని మరో హీరో బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.