Begin typing your search above and press return to search.

ఈ స్టార్‌ కపుల్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   22 Feb 2020 8:30 AM GMT
ఈ స్టార్‌ కపుల్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారా?
X
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ హృతిక్‌ రోషన్‌ ఇంకా సుజానే ఖాన్‌ లు విభేదాల కారణంగా తమ 14 ఏళ్ల వైవాహిక జీవితానికి 2014లో గుడ్‌ బై చెప్పి విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. విడాకులు తీసుకున్న సమయంలో వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కోసం ఇద్దరు స్నేహంగా ఉంటూ వచ్చారు. పిల్లలకు తల్లిదండ్రుల లోటు ఉండకూడదు అనే ఉద్దేశ్యం తో తరుచుగా పిల్లల కోసం కలుస్తూ ఉండేవారు. విడాకుల తర్వాత తరుచుగా కలుస్తు ఉన్న కారణంగానో ఏమో కాని మళ్లీ ఇద్దరి మద్య అన్యోన్యం పెరిగిందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

నిన్న మహాశివరాత్రి సందర్బంగా ముంబయిలోని ప్రముఖ శివాలయం లో వీరిద్దరు జంటగా పూజలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. హృతిక్‌ కుటుంబ సభ్యులు శివరాత్రి సందర్బంగా అక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజల్లో హృతిక్‌ తల్లిదండ్రులు రాకేష్‌ రోషన్‌ ఇంకా పింకీ రోషన్‌ లు కూడా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో దంపతుల మాదిరిగా పాల్గొన్న కారణంగా మళ్లీ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా అనే చర్చ మొదలైంది.

2000వ సంవత్సరం లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరు ఏదో చిన్న గొడవ కారణం గా 2014లో విడాకులు తీసుకున్నారు. గొడవపై ఇద్దరు కూడా పలు సార్లు మీడియా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. ఆ గొడవ ఏంటీ అనే విషయం క్లారిటీ లేదు.. కాని అది చిన్న గొడవే అని పిల్లల కోసం ఇప్పుడు మళ్లీ కలిసి పోయారు అంటున్నారు. విడాకులు తీసుకున్నారు కనుక వీరిద్దరు టెక్నికల్‌ గా మళ్లీ పెళ్లి చేసుకుంటేనే భార్య భర్తలు అవుతారు. కనుక కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకుని ఉంటారని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.