Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ బ్రాండ్ వ‌చ్చేస్తోంది

By:  Tupaki Desk   |   20 Jan 2022 8:20 AM GMT
ఐకాన్ స్టార్ బ్రాండ్ వ‌చ్చేస్తోంది
X
వెండితెర‌పై త‌మ‌దైన స్టైల్ తో ఆక‌ట్టుకుంటున్న స్టార్స్ కొంద‌రు త‌మ బ్రాండ్ ల‌ని ప్ర‌త్యేకంగా సృష్టిస్తూ మార్కెట్ లోకి వ‌దులుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఇలా త‌మ ప్ర‌త్యేక బ్రాండ్ ల‌ని క్రియేట్ చేసి వాటిని త‌మ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా వైర‌ల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్ప‌టికే రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న క్రేజ్ నే రౌడీ బ్రాండ్ గా మార్చి వ‌స్త్ర ప్రంచంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.

రౌడీ బ్రాండ్ కి భారీ క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టే న్యూ స్టైల్ డ్రెస్ డిజైన్స్ ని మార్కెట్ లోకి దించేసి త‌న స‌త్తా చాటుకుంటున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. యూత్ లో ఆయ‌న‌కున్న క్రేజ్ కార‌ణంగా రౌడీ బ్రాండ్ హూజ్ సేల్ అవుతూ వ‌స్త్ర ప్ర‌పంచంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` టైమ్ లో బ‌న్నీకి విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న బ్రాండ్ డ్రెస్ ని గిఫ్ట్ గా అందించి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

ఇదే త‌ర‌హాలో స్టార్ హీరోయ‌న్ స‌మంత సాకీ పేరుతో కొత్త బ్రాండ్ ని ప్రారంభించి వ‌స్త్ర ప్ర‌పంచంలోకి ప్ర‌వేశించారు. సామ్ బ్రాండ్ కూడా హ్యూజ్ స‌క్సెస్ కావండంతో పాన్ ఇండియా స్టార్ ఐకానిక్ హీరో అల్లు అర్జున్ కూడా ఈ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారు. ఏఏ బ్రాండ్ పేరుతో వ‌స్త్ర ప్ర‌పంచంలోకి ప్ర‌వేశిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చ‌క చ‌కా జ‌రిగిపోతున్న‌ప‌ట్టుగా తెలుస్తోంది.

అయితే త‌ను ప్రారంభించ‌బోయే ఏఏ బ్రాండ్ డ్రెస్సెస్ అంద‌రికి అందుబాటులో వుండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్రైజ్‌ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ త‌న బ్రాండ్ డ్రెస్సెస్ అందుబాటులో ల‌భించేలా ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిసింది. బ‌న్నీ అంటే స్టైల్ కి మారు పేరు. అదే త‌న బ్రాండ్ లో కనిపిస్తూనే అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన రేట్ ల‌లో అందుబాటులో వుండేలా బ‌న్నీ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే `పుష్ప‌` తో పాన్ ఇండియా లెవెల్లో సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేప‌థ్యంలో బ‌న్నీ ప్రారంభించ‌నున్న ఏఏ బ్రాండ్ పాన్ ఇండియా స్థాయిలో వైర‌ల్ అవ‌డం ఖాయం అని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు.