Begin typing your search above and press return to search.
ఇలియానా కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
By: Tupaki Desk | 20 May 2022 1:30 AM GMTగోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన అమ్మడి ప్రస్థానం 'దేవుడుల చేసిన మనుషులు' వరకూ సాఫీగానే సాగింది. అప్పటికీ ఇలియానాకి అవకాశాల పరంగా ఢోకా లేదు. కొత్త అవకాశాలు అమ్మడి ఇంటి తలుపు తట్టాయి. ఇంకా కెరీర్ పీక్స్ లో నే ఉంది. సరిగ్గా అదే సమయంలో 'బర్పీ' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
తొలి సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఇలియానాకి అక్కడ అవకాశాల పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిపోయింది. ఈ క్రమంలో తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాల్ని సున్నితంగా తిరస్కరించింది. కేవలం బాలీవుడ్ పైనే దృష్టి పెట్టి పనిచేసింది.
'బర్పీ' తెచ్చిన ఇమేజ్ ని కొంత కాలమే నిలబెట్టుకోగల్గింది. ఆ తర్వాతి కాలంలో ఆ రేంజ్ లో సక్సెస్ ఇలియానాకి దక్కలేదు. సినిమాలు చేసుకుంటూ వెళ్లింది తప్ప సక్సెస్ గ్రాప్ ని మెరుగు పరుచుకోవడంలో విఫలమైంది. అమ్మడు నటించిన స్టార్ చిత్రాలేవి ఇమేజ్ ని రెట్టింపు చేయలేకపోయాయి. ఇప్పటికీ రెండు మూడు అవకాశాలు చేతిలో ఉన్నాయి.
కానీ టాలీవుడ్ ఇచ్చిన ఐడెంటిటీ బాలీవుడ్ ఇవ్వలేదన చెప్పాలి. బాలీవుడ్ ఎంట్రీ అనంతరం కొన్నాళ్ల పాటు ప్రేమాయణాల్లోనూ మునిగి తేలింది. ఈ రిలేషన్స్ అమ్మడి కెరీర్ పై కొంత ప్రభావాన్ని చూపాయి. బ్రేకప్ ల కారణంగా మానసిక వేదన తప్పలేదు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలు సైతం వదులుకుంది. ఇలియానా కెరీర్ మొత్తంలో ప్రేమ వైఫల్యం మాత్రం తీవ్ర మనో వేదనకి గురిచేసిందన్నది వాస్తవం.
తెలుగులో చివరిగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో నటించింది. బాలీవుడ్ లో కెరీర్ డల్ అయిన క్రమంలో టాలీవుడ్ లో ఆ చిత్రంతో కంబ్యాక్ అయింది. కానీ ఆ సినిమా పరాజయంతో మళ్లీ అటువైపు చూసింది లేదు. దాదాపు ఇలియానా ఛరిష్మా తెలుగులో చెరిగిపోయిందనే చెప్పాలి. టాలీవుడ్ లో ఆమె ఇప్పుడు సినిమాలు చేసినా చూసే పరిస్థితి తేదని విమర్శలొస్తున్నాయి.
నవతంర భామలు ఆమె స్థానాన్ని ఆక్రమించారని తెలుస్తోంది. కొనసాగినంత కాలం బాలీవుడ్ లో కొనసాగి రిటైర్మెంట్ ప్రకటించడమే ఉత్తమం అన్న టాక్ వినిపిస్తుంది. ఇలియానా ఇంకా పెళ్లి చేసుకుని స్థిరపడాలి. జీవితంలో అతి ప్రధానమైన ఘట్టం ఇంకా మిగిలే ఉంది. ఇకపై ఇలియానా కుటుంబ జీవితంపై ఫోకస్ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు గుసగుస వినిపిస్తుంది. ప్రస్తుతం హిందీలో 'అన్ ఫెయిర్ లవ్లీ' అనే చిత్రంలో నటిస్తోంది. మరో ప్రాజెక్ట్ అండర్ ప్రొడక్షన్ లో ఉంది. మరి వీటి సక్సెస్ తో ముందుకు సాగుతుందా? లేక 34 ఏళ్ల నటి వివాహ బంధంతో విశ్రాంతి తీసుకుంటుందా? అన్నది చూడాలి.