Begin typing your search above and press return to search.
బోయపాటికి ఇది తగునా?
By: Tupaki Desk | 5 Dec 2021 11:30 PM GMTనాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చలన్నీ ప్రధానంగా అఖండ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాల్ని మించిపోయి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో చెప్పుకోవడానికి హైలైట్లు చాలానే ఉన్నాయి. అదే సమయంలో అభ్యంతరకరంగా అనిపించే సన్నివేశాలు కూడా తక్కువేమీ కాదు. ఒక సన్నివేశం పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను అభిరుచిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్న ఆ సన్నివేశం థియేటర్లో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఇబ్బందికి గురి చేస్తోంది.
సినిమాలో ఒక చోట విలన్ శ్రీకాంత్ పాత్ర తన క్రూరత్వాన్ని చూపించే క్రమంలో.. పూర్ణ పాత్ర మీద అఘాయిత్యానికి పాల్పడుతుంది. ఐతే సినిమాల్లో విలన్లు అమ్మాయిలను రేప్ చేసే సీన్లు కొత్తేమీ కాదు కానీ.. ఇందులో మాత్రం బోయపాటి ఆలోచన హద్దులు దాటిపోయింది. తాను ఎవరిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడో.. ఆ మహిళ కొడుకు అదంతా చూడాలని అంటాడు విలన్. ఇలా పూర్ణ మీద శ్రీకాంత్ అత్యాచారం చేస్తుంటే.. ఒక రౌడీ ఆమె కొడుకుతో బలవంతంగా అదంతా చూపిస్తాడు.
విలన్ క్రూరత్వాన్ని చూపించాలనుకోవడం ఓకే కానీ.. అందుకు ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడమే దారుణం. ఏ రకంగా చూసినా ఇది ఆమోదయోగ్యమైన సన్నివేశం కాదు. ఇదే కాక ప్రథమార్ధంలో ప్రగ్యా జైశ్వాల్ చేసిన కలెక్టరు పాత్రను తీర్చిదిద్దిన విధానంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టరులో ఉండాల్సిన హుందాతనం ఎక్కడా ఈ పాత్రలో కనిపించదు. పైగా ఆమె హీరోతో కల్లు తాగించడం.. ఆవకాయ నాకమని చెప్పడం.. ఈ సీక్వెన్స్ అంతా కూడా కృతకంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.