Begin typing your search above and press return to search.

2022 పాఠం.. ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటే దెబ్బెనా?

By:  Tupaki Desk   |   14 Dec 2022 1:30 AM GMT
2022 పాఠం.. ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటే దెబ్బెనా?
X
నక్సలిజం అంటే ఒకప్పుడు ఒక భావోద్వేగం అలాగే ఒక వీరోచిత పోరాటం అనే భావనలు ఎక్కువగా వినిపించేవి.. ఆ ఫార్మాట్లో వచ్చిన సినిమాలకు కూడా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద అలా రేంజ్ లో సక్సెస్ అయ్యేవి. కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది నక్సలిజం అనే కాన్సెప్ట్ లు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. అసలు నేటితరం జనాలకు కూడా ఆ విలువలు ఏమాత్రం తెలియవు కాబట్టి సినిమాల్లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ వచ్చే సినిమాలకు గుర్తింపు రావడం లేదు.

ఇక ఈ ఏడాది వచ్చిన నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కమర్షియల్ ఫార్మాట్ లో హీరోల క్యారెక్టర్స్ ను దర్శకుడు నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తీసుకువచ్చారు. ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దర్శకుడు కొరటాల శివ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకోవడంతో కావాలని రామ్ చరణ్ పాత్రను ఇరికించి మరి ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక రానా దగ్గుపాటి సాయి పల్లవి జంటగా నటించిన విరటపర్వం కూడా క్లిక్ కాలేదు. వేణు ఉడుగుల క్రియేట్ చేసిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా నక్సల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరపైకి వచ్చింది.

అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. సాయి పల్లవి క్రేజ్ కూడా ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక సంతోష్ శోభన్ నటించిన రొమ్ కామ్ మూవీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ లో కూడా కొంత నక్సల్ కంటెంట్ ఉంటుంది.

మేర్లపాక గాంధీ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా జనాలకు ఏమాత్రం ఎక్కలేదు. సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది ఈ విధంగా 2002లో వచ్చిన మూడు నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చే అవకాశం లేదనే అనిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.