Begin typing your search above and press return to search.
నైజాంలో సర్కారు వారికి ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టమేనా..?
By: Tupaki Desk | 6 April 2022 12:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని.. సమ్మర్ కానుకగా 2022 మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
'సర్కారు వారి..' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, పంపిణీదారులలో ఒకరైన దిల్ రాజు తీసుకున్నారని తెలుస్తోంది. RRR సినిమాను భారీ రేటుకు దక్కించుకుని లాభాలు పొందిన దిల్ రాజు.. ఇప్పుడు మహేష్ చిత్రం కోసం అత్యధిక ధర చెల్లించారని తెలుస్తోంది.
అగ్ర నిర్మాత దాదాపు 40 కోట్లకు SVP రైట్స్ పొందారని టాక్ నడుస్తోంది. మహేష్ బాబుకి ఇది హైయెస్ట్ అని అంటున్నారు. నైజాంలో 260 - 280 థియేటర్లలో మాత్రమే 'సర్కారు వారి పాట' చిత్రాన్ని విడుదల చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇతర సినిమాల కారణంగానే ఎక్కువ థియేటర్లు కేటాయించలేకపోతున్నాడని అంటున్నారు.
ఏప్రిల్ 13న విడుదల కానున్న తమిళ్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. విజయ్ తో తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు బీస్ట్ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
అలానే ఏప్రిల్ 14న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక RRR సినిమా 50 రోజుల థియేట్రికల్ రన్ ఉండేలా మేకర్స్ తో అగ్రిమెంట్ రాసుకున్నారనట. ఒకవేళ హిట్ టాక్ వస్తే 'బీస్ట్' మరియు 'కేజీఎఫ్ 2' సినిమాలు ఎక్కువ థియేటర్లను ఆక్యుఫై చేసే అవకాశం ఉంది.
అంతేకాదు నైజాంలో చాలా వరకు మెయిన్ థియేటర్లను ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోన్న 'ఆచార్య' సినిమా కోసం బ్లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 12న వచ్చే 'సర్కారు వారి పాట' సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. నైజాంలో ఏరియాలో ఇంతకముందు మహేష్ బాబు నటించిన సినిమాల్లో '1 నేనొక్కడినే' కి అత్యధికంగా 351 థియేటర్లు కేటాయించారు.
శ్రీమంతుడు (331) - బ్రహ్మోత్సవం (347) - స్పైడర్ (330) - భరత్ అనే నేను (295+) - మహర్షి (345+) - సరిలేరు నీకెవ్వరు (323) సినిమాలు మహేష్ కెరీర్ లో నైజాంలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయబడిన జాబితాలో ఉన్నాయి. మరి 'సర్కారు వారి పాట' చిత్రాన్ని దిల్ రాజు ఎన్ని చోట్ల రిలీజ్ చేస్తారో చూడాలి.
ఇకపోతే కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న SVP సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. ఫ్లైహై సినిమాస్ తో కలిసి శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ మరియు క్లాసిక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు USA థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. మహేష్ బాబుకు ఓవర్సీస్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.
'సర్కారు వారి..' షూటింగ్ ఇప్పటికే 95 శాతం కంప్లీట్ అయింది. త్వరలో పెండింగ్ లో ఉన్న పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ విశేష స్పందన తెచ్చుకుంది. 'కళావతి' మరియు 'పెన్నీ' పాటలు మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సముద్ర ఖని - ప్రకాశ్ రాజ్ - సుబ్బరాజు - వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.