Begin typing your search above and press return to search.
థియేటర్ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?
By: Tupaki Desk | 28 Jun 2021 11:30 AM GMTకోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నెమ్మదిస్తుండడంతో చాలా రంగాల్లో తిరిగి పనులు మొదలవుతున్నాయి. సినిమాల షూటింగులు మొదలవుతున్నాయి. అయితే థియేట్రికల్ రంగం మాత్రం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
సెకండ్ వేవ్ వల్ల సుదీర్ఘ కాలం థియేటర్ల బంద్ ని పాటించారు. చాలా చోట్ల జీవోల వల్ల మూత పడితే తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగానే థియేటర్లను మూసివేశారు. అయితే ఇప్పటికి అయినా తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే దానికి సరైన క్లారిటీ లేదు.
కరోనావైరస్ రెండవ వేవ్ తర్వాత ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కానీ థియేటర్లు తిరిగి తెరిచినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తారా లేదా అనే సందిగ్ధత కూడా వెంటాడుతోంది. థియేటర్లు తెరిచినా కరోనావైరస్ మూడవ వేవ్ అంచనాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహమ్మారి సంక్షోభం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక సింగిల్ స్క్రీన్లు శాశ్వతంగా మూసివేయడం మరో ఇబ్బంది. మెజారిటీ ఎగ్జిబిటర్లు వాటిని తిరిగి తెరిచే మానసిక స్థితిలో లేవు. భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ ల మనుగడ కఠినంగా ఉంటుందని వారిలో కొందరు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిష్కరించాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి. టికెట్ ధరలపై జీవోలు సవరించే వరకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు థియేటర్లను తిరిగి తెరవడానికి సిద్ధంగా లేరు.
అయితే థియేట్రికల్ రంగం కోలుకోవాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? అన్న దానిపైనా పరిశ్రమలో తర్జన భర్జన సాగుతోంది. తొందర్లోనే పరిశ్రమల పెద్దలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి థియేయటర్ రంగం సమస్యలపై విన్నవించనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పుడున్న సన్నివేశంలో థియేటర్లను తిరిగి అక్టోబర్ నాటికి కానీ తెరిచేందుకు చాలామంది ఆసక్తిగా లేరన్న గుసగుసా వేడెక్కిస్తోంది.