Begin typing your search above and press return to search.
చిరు, బాలయ్య సక్సెస్ కొడితే కష్టమే?
By: Tupaki Desk | 2 Jan 2023 3:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఈ సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రెండు సినిమాల్లో కూడా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఉంటాయి అని చిత్ర యూనిట్ సభ్యులు బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఒక విధంగా వస్తున్న అప్డేట్స్ తో పాటు విడుదలవుతున్న సాంగ్స్ కూడా అవే చూపిస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అయితే ఏది కూడా ఊహించని స్థాయిలో అయితే మ్యాజిక్ క్రియేట్ చేయలేదు. ఇక వెండి తెరపై చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. కానీ మెలోడీ సాంగ్స్ మాస్ సాంగ్స్ ఇలా అన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి తరహాలో ఉన్నాయి అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ కు ఏం కావాలో అది ఇస్తున్నామని దర్శకులు మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా పూణకాలు లోడింగ్ అయితే మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. ఇక మరోవైపు బాలయ్య బాబు సినిమాలో మాస్ ఉండే విధంగా మాస్ కు మొగుడు అనే పాటను విడుదల చేస్తున్నారు. ఈ పదాలు పద్ధతులు చూస్తూ ఉంటే అసలు మాస్ ఆడియన్స్ ను పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసి మరి డిజైన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
కథ పరంగా సినిమాకు ఏమీ అవసరం అనేదానికన్నా కూడా ఆడియన్స్ ను ఏదో ఒక విధంగా ధియేటర్లో గోలగోల చేయించాలి అనే తరహాలోనే మీరు ప్రణాళికలు రచిస్తున్నట్లు అనిపిస్తుంది.
అయితే ఒకవేళ ఈ రెండు సినిమాలు కూడా పక్కా మాస్ కమర్షియల్ పాయింట్స్ తోనే సక్సెస్ అయితే మాత్రం నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ అదే తరహాలో ముందుకు వెళ్లడానికి ఇష్టపడవచ్చు.
ఇక వారి వద్దకు వచ్చే దర్శకులు కూడా ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూస్తారేమో అని తరహాలో ఆలోచించకుండా ఉండలేరు. కాబట్టి సంక్రాంతికి ఈ రెండు సినిమాలు కేవలం మాస్ కమర్షియల్ పాయింట్స్ ద్వారా సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ వచ్చే సంక్రాంతికి కొత్త బాలక్రిష్ణను ప్రయోగాత్మకమైన చిరంజీవిని చూడడం కష్టమే అవుతుందేమో..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.