Begin typing your search above and press return to search.
జనాన్ని థియేటర్లకు రమ్మనడం న్యాయమేనా?
By: Tupaki Desk | 17 July 2021 2:30 PM GMTకరోనా మహమ్మారీ క్రైసిస్ ఏడాదిన్నరగా ప్రజలను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెకండ్ వేవ్ నెమ్మదిస్తున్నా ఇంకా మహమ్మారీ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ తో చాలా వరకూ సురక్షితం అనుకుంటున్నా ఇంకా కొత్త కేసులు రావడం ఇబ్బందికరం.
క్రైసిస్ కొనసాగుతున్నా ఇలాంటి సమయంలో థియేటర్లను తెరుస్తున్నారు. తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీ.. ఆంధ్రాలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని ఆడిస్తారు. అయితే ఇప్పుడున్న క్రైసిస్ లో జనాల్ని థియేటర్లకు రమ్మనడం న్యాయమైనదేనా? అని అగ్ర దర్శకుడు ఎగ్జిబిటర్ కం పంపిణీదారుడు డి.సురేష్ బాబు ప్రశ్నించడం విశేషం. మన కుటుంబ సభ్యులనే థియేటర్లకు పంపడం లేదు. అలాంటప్పుడు ప్రజల్ని థియేటర్లలో సినిమాలు చూడమని అడగడం లో న్యాయం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక థియేటర్లలో కాకుండా ఓటీటీలో నారప్ప చిత్రాన్ని రిలీజ్ చేయడంపై వెంకటేష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఫిలింఛాంబర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఇది తమ నిర్మాణ సంస్థ లో తెరకెక్కిన సినిమా కాదని తాము భాగస్వాములం మాత్రమేనని సురేష్ బాబు తెలిపారు.
తమ సినిమాని ఎక్కడైనా రిలీజ్ చేసుకునే హక్కు నిర్మాతకు ఉంటుందని ఇంతకుముందు ఓ చిట్ చాట్ లో ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. నారప్పను కళైపులి ఎస్.థాను నిర్మించగా సురేష్ బాబు ఇందులో భాగస్వామి అన్న సంగతి తెలిసినదే. మొత్తానికి నారప్ప ఈనెల 20న నేరుగా ఓటీటీలోకొచ్చేస్తోంది. అలాగే వెంకీ నటించిన దృశ్యం 2 థియేటర్లలో వస్తుందా లేక ఓటీటీలోనే విడుదలవుతుందా? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది. రానా విరాఠపర్వం థియేట్రికల్ రిలీజ్ కి వస్తుందనే భావిస్తున్నారు. ఇక తమ సంస్థ నిర్మించే సినిమాలను థియేటర్లలోకి తెస్తామని సురేష్ బాబు హామీ ఇచ్చారు కాబట్టి ఏం జరగనుందో వేచి చూడాలి.