Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఇది కొత్త ట్రెండ్‌ కాబోతుందా?

By:  Tupaki Desk   |   19 July 2021 8:30 AM GMT
టాలీవుడ్ లో ఇది కొత్త ట్రెండ్‌ కాబోతుందా?
X
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్‌ లో ఒక్కో ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రతి సినిమాకు ఒక ప్రమోషనల్ సాంగ్ ఉండబోతుందా అంటే ఔను అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలను ఎంతగా తీసినా వాటిని ప్రమోషన్‌ చేయడం కోసం అంతకు మించి కష్టపడాల్సిన అవసరం ఉంది. సినిమా జనాల వద్దకు వెళ్లే వరకు చాలా ప్రమోషన్ లు చేయాలి.. సినిమా ను చూడాలి అనిపించేలా జనాల్లో ఆలోచన తీసుకు వచ్చేలా ప్రమోషన్స్‌ జరగాలి. అప్పుడే జనాలు సినిమాలు చూసేందుకు వస్తారు. సినిమా సక్సెస్ అయినా కూడా ప్రమోషన్ సరిగా లేకుంటే కమర్షియల్‌ గా దెబ్బ తీసిన సందర్బాలు ఉన్నాయి. అందుకే ప్రమోషన్‌ కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి క్రియేటివిటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందు ముందు ప్రతి సినిమాకు కూడా ఒక ప్రమోషనల్‌ సాంగ్స్ ఉంటాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి కొందరు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్‌ ఆర్ కోసం భారీ ఎత్తున ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ను చిత్రీకరిస్తున్నారు. సినిమా లో కథానుసారంగా వచ్చే పాటలు ఉంటాయట. అయినా కూడా కూడా ప్రమోషనల్‌ సాంగ్‌ అంటూ ప్రత్యేకంగా ఇద్దరు హీరోలపై భారీ ఎత్తున తెరకెక్కించేందుకు జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకోసం భారీ సెట్టింగ్‌ ను కూడా వేయించాడు. ఇద్దరు హీరోలతో పాటు వందల మంది డాన్సర్స తో ఈ పాట ను చిత్రీకరించబోతున్నారట. సినిమా ప్రమోషన్ లో ఆ పాట చాలా కీలకం అవ్వబోతుందట. కథ ను రివీల్‌ చేయకుండా ఇద్దరు హీరోల పాత్రలను చాలా పవర్‌ ఫుల్ గా చూపించినట్లుగా ఆ పాటలో చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక వైపు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్‌ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నితిన్‌ హీరోగా నటించిన మాస్ట్రో సినిమా కోసం ప్రమోషనల్‌ సాంగ్‌ ను చిత్రీకరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. సినిమా కోసం ఇప్పుడు ప్రమోషనల్‌ సాంగ్‌ చేయాలని భావిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. తమన్నా పై ఈ ప్రమోషనల్‌ సాంగ్ ఉంటుంది. నితిన్ మరియు తమన్నాలతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు మరియు పెద్ద ఎత్తున డాన్సర్స్ ను ఈ పాట కోసం తీసుకోబోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ పాట కోసం ఏకంగా మేకర్స్‌ 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారట. తమన్నాకు అదనపు పారితోషికం తో పాటు సెట్‌ మరియు ఇతర ఖర్చులు మొత్తం కలిపి 50 లక్షలు అయినా కూడా సినిమా ప్రమోషన్‌ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ ను తెరకెక్కిస్తున్నారు.

థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అవుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ మూవీ అంధాదున్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. నభా నటేష్‌ హీరోయిన్‌ గా నటించగా తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది. విలక్షణ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రమోషనల్‌ సాంగ్ తో ఫలితం దక్కించుకుంటే ముందు ముందు టాలీవుడ్‌ లో ప్రతి సినిమా కూడా ప్రమోషనల్‌ సాంగ్ తో రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌ భవిష్యత్తులో కొనసాగబోతుందేమో చూడాలి.