Begin typing your search above and press return to search.
'లైగర్' బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం అసాధ్యమేనా..?
By: Tupaki Desk | 26 Aug 2022 8:30 AM GMTయంగ్ హీరో విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''లైగర్'' మూవీ నిన్న గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా.. ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. తొలి ఆట నుంచే డిజాస్టర్ అనే టాక్ రావడంతో రెండో రోజు ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. దీన్ని బట్టి ఫస్ట్ వీకెండ్ లో ఆశించిన మేర బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'లైగర్' చిత్రానికి యుఎస్ఏ ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు. తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోనూ విజయ్ సినిమా పరిస్థితి అలానే ఉంది. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాని ఔట్ డేటెడ్ కంటెంట్ అని తేల్చేశారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఈ సినిమాకు ఒకటిన్నర స్టార్స్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.
"లైగర్" అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. టాలెంట్ - వనరులు మరియు అవకాశం పూర్తిగా వ్యర్థం అయ్యాయి. విజయ్ దేవరకొండ హిందీలో బెటర్ లాంచింగ్ కు అర్హుడు.. ఈ లైగర్ ఏమాత్రం గర్జించలేదు అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ లో పేర్కొన్నారు. అలానే ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కరణ్ తౌరానీ కూడా ఈ చిత్రాన్ని పూర్ రెస్పాన్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.
'లైగర్' సినిమా సౌత్ లో రూ.30-35 కోట్లతో ఓపెన్ అబుతుందని ముందుగా అంచనా వేసుకున్నామని.. కానీ ఇప్పుడు తెలుగు మార్కెట్ లో ఈ చిత్రానికి ఆశించిన స్పందన రాలేదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ అభిప్రాయపడ్డారు. సినిమా లైఫ్ టైం రన్ రూ. 170-180 కోట్లుగా ఉంటుందని.. అందులో 25 శాతం హిందీ మార్కెట్ నుండి రావాలని ముందుగా అంచనా వేశాం. కానీ ప్రస్తుత ట్రెండ్‌లను చూస్తుంటే రూ. 55 - 60 కోట్లు మాత్రమే వసూలు చేయొచ్చని తౌరానీ చెప్పారు.
అయితే 'లైగర్' మేకర్స్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మొదటి రోజున రూ. 33.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసిందని.. ఈజీగా 1 మిలియన్ మార్క్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా పరిగణిస్తున్నారు.
లైగర్' పబ్లిక్ టాక్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. పేలవమైన కంటెంట్ తో ఏమాత్రం ఎమోషనల్ కనెక్షన్ లేని ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ ఆశించడం సమంజసం కాదని అంటున్నారు. సినిమా చుట్టూ నెలకొన్న హైప్ కారణంగా ఫస్ట్ డే ఆ మాత్రం వసూళ్ళు వచ్చాయి కానీ.. ప్రెజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే రెండో రోజు నుంచి కష్టమేనని విశ్లేషిస్తున్నారు. మేకర్స్ లెక్కల ప్రకారం చూసుకున్నా డిజాస్టర్ టాక్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ మరియు గణేష్ చతుర్థి సెలవును క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసిన 'లైగర్' టీమ్ కు ఎదురుదెబ్బ తగిలినట్లుగా పేర్కొంటున్నారు. రెండో రోజు ఆక్యుపెన్సీ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం అసాధ్యమని అభిప్రాయ పడుతున్నారు.
బుక్ మై షోలో దాదాపు అన్ని షోలు గ్రీన్ గా కనిపిస్తుండగా.. అక్కడక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ లో బుకింగ్స్ ఉన్నాయి. ఇప్పటికైతే శని - ఆదివారాల బుకింగ్స్ కూడా అలానే ఉంది. యూఏస్ఏలోనూ 'లైగర్' పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ప్రీమియర్స్ టాక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.
వాస్తవికతకు దగ్గరగా ఉన్న సినిమాలు మరియు అసాధారణమైన కంటెంట్ తో తీసిన చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద పని చేస్తాయని ఇటీవల కొన్ని సినిమాలు నిరూపించాయి. మంచి కంటెంట్ లేకుండా ఎంతగా పబ్లిసిటీ చేసినా రెండో రోజు నుంచి జనాలను థియేటర్లలోకి తీసుకురావడం కష్టమని అర్థమవుతుంది. ఇప్పుడు 'లైగర్' కూడా ఆ విషయంలో విఫలమైందనే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో విజయ్ సినిమా పనితీరు ఏవిధంగా ఉంటుందో చూడాలి.