Begin typing your search above and press return to search.
హిందీ బెల్ట్ లో 'RRR' కి రికార్డులు సాధ్యమేనా?
By: Tupaki Desk | 25 March 2022 8:30 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా `ఆర్ ఆర్ ఆర్` కొన్ని గంటల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల నుంచి సాగుతోన్న నీరిక్షణకు తెరపడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరి స్టార్ల ఇమేజ్..`బాహుబలి` తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో `ఆర్ ఆర్ ఆర్` ప్రకటనతోనే దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్ కి చేరాయి. ఓవర్సీస్ సహా అమెరికా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో రిలీజ్ కోసం ఎదురుచూసింది.
అమెరికాలో ప్రీమియర్ల తోనే సినిమాపై పాజిటివ్ సైన్ పడింది. అంతకుముందు అడ్వాన్స్ బుకింగ్ లతోనే `ఆర్ ఆర్ ఆర్` సరికొత్త రికార్డు సృష్టించింది. రాజమౌళి త్రయం కారణంగానే ఇది సాధ్యమైంది. యూఎస్ లో 3 మిలియన్ల డాలర్ మార్క్ ని ప్రీమియర్ షోలతోనే సాధించింది. సరిగ్గా రాత్రి 9 గంటలకు (పీఎస్ టీ) ప్రీమియర్లతో $3 మిలియన్ మార్క్ ని అధిగమించింది. మొత్తం 985 లొకేషన్ల నుంచి $ 3,019,897 వసూళ్లని సాధించింది. ఇంకా 200 లొకేషన్లకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది.
ఈ రోజు సాయంత్రం వరకూ ప్రీమియర్ షోల అమెరికా వసూళ్ల పూర్తి నివేదిక అందే అవకాశం ఉంది. 3.5 మిలియన్ వసూళ్లని సునాయాసంగా చేధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదంతా కేవలం `ఆర్ ఆర్ ఆర్` ముందొస్తు హైప్ తోనే సాధ్యమైందన్నది వాస్తవం. మరి లాంగ్ రన్ లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? అన్నది చూడాలి.
ప్రస్తుతానికి `ఆర్ ఆర్ ఆర్` కి పోటీగా ఏ సినిమా కూడా లేదు. కాబట్టి తెలుగు ఆడియన్స్ ఆదరణకి ఎలాంటి సమస్యలేదు. అయితే గ్లోబల్ మూవీగా నిలబడుతుందా? అన్నదే పెద్ద టాస్క్. `బాహుబలి` చిత్రాన్ని ఓ సెక్షన్ స్థానిక అమెరికన్స్ సైతం ఆదరించారు. కొన్ని హాలీవుడ్ చిత్రాల అనుసరణ కాబట్టి అది సాధ్యమైంది. మరి `ఆర్ ఆర్ ఆర్` కి అలాంటి సన్నివేశం రిపీట్ అవుతుందా? అన్నది చూడాలి.
ఇక తెలుగు రాష్ర్టాల్లోనూ `ట్రిపుల్ ఆర్` హవా కొనసాగుతుందని ఎనలిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు. చరణ్-తారక్ మాస్ ఇమేజ్ తో మార్కెట్లో 'ఆర్ ఆర్ ఆర్'దూకుడు కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది. మరి హిందీ బెల్ట్ పరిస్థితి ఏంటి? అంటే అక్కడ నుంచి `ఆర్ ఆర్ ఆర్` కి కాస్త ప్రతికూలత ఎదురయ్యే సన్నివేశం కనిపిస్తుందని అంటున్నారు.
`ఆర్ ఆర్ ఆర్` కథకి..పాత్రలకి ఉత్తరాది అభిమానులు కనెక్ట్ అవుతారా? అంటే సందేహాలే తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి డ్రెమటైజ్ కథలు అక్కడ కొత్తేం కాదు. ఎన్నో పిరియాడిక్ చిత్రాల్ని ఆస్వాదించిన ఆడియన్స్ ఉన్నారు. వాస్తవ కథలుగా చెప్పిన కొన్ని స్టోరీలే అక్కడ వైఫల్యం చెందిన సంఘటనలున్నాయి. వాటితో పోల్చుకుంటే 'ఆర్ ఆర్ ఆర్' లో అంత గొప్ప విషయం ఏముంది? అన్న వాదన తెరపైకి వస్తోంది.
ఇలాంటి విజువల్ ట్రీట్లు అక్కడ కొత్తేం కాదు. అంతకు మించిన టెక్నికల్ స్టాండర్డ్ సినిమాలు ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించాయి అన్న విమర్శ వినిపిస్తోంది. ఇది కేవలం నార్త్ లో ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి వస్తోన్న టాక్ మాత్రమే. మరి పూర్తి స్థాయిలో `ఆర్ ఆర్ ఆర్` పై ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది? బాలీవుడ్ దిగ్గజాలు ఎలా స్పందిస్తారు? జక్కన్నని మెచ్చే అమీర్ ఖాన్ ట్వీట్ ఏదైనా ఉంటుందా? అన్నది వేచి చూడాలి.
ఇది పాన్ ఇండియా కేటగిరి సినిమా కాబట్టి తెలుగు రాష్ర్టాలు మినహా మిగతా చోట్ల సక్సెస్ అన్నది కీలకం. అప్పుడే అది పాన్ ఇండియా సక్సెస్ అవుతుంది. మరి `ఆర్ ఆర్ ఆర్` బాహుబలిలా నిలుస్తుందా? అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.