Begin typing your search above and press return to search.
మహేష్ ప్రాజెక్ట్ కు జక్కన్నది అదే ఫార్ములానా?
By: Tupaki Desk | 5 Dec 2022 2:30 PM GMTప్రపంచ వ్యాప్తంగా 'RRR' సంచలనాలు సృష్టిస్తోంది. టాలీవుడ్ క్రేజీ స్టార్స్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా రాజమౌళి పేరు హాలీవుడ్ ప్రముఖుల్లోనూ రీసౌండ్ ఇచ్చేలా చేసింది. త్వరలో జరగనున్న అకాడమీ అవార్డుల బరిలోనూ 'RRR' పోటీపడాలని రాజమౌళి ఎంత వరకు లాబీయింగ్ చేయాలో అంత వరకు చేశారు. దీని కోసం భారీ రేంజ్ లో ఖర్చు కు వెనకాడకుండా ఖర్చు చేసినట్టుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపస్తోంది.
రీసెంట్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ 2022 కు గానూ రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆస్కార్ రేసులోనూ 'RRR' నిలవడం ఖాయం అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB29 ని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది?
ఎలా వుండబోతోంది? అనే విషయాలని తాజాగా వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ లో ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారని, ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి వెల్లడించారు. ఇండియానా జోన్స్ తరహాలో ఆఫ్రీకా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. వరల్డ్ వైడ్ గా వున్న పాపులర్ ప్రదేశాల్లో ఈ మూవీని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాట్టుగా విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు.
ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారని ప్రారంభం నుంచి రాజమౌళి చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కె.ఎల్. నారాయణతో పాటు ఈ ప్రాజెక్ట్ లో మరి కొంత మంది నిర్మాతలు భాగస్వాములుగా వ్యవహరించే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ సంస్థతో పాటు రాజమౌళి కూడా ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం వుందని తెలుస్తోంది.
'బాహుబలి' నుంచి రాజమౌళి తనురూపొందించే సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకుండా 50 శాతం మాత్రమే తీసుకుంటూ మిగతా భాగం లాభాల్లో వాటా తీసుకుంటున్న విషయం తెలిసిందే. మహేష్ ప్రాజెక్ట్ విషయంలోనూ అదే ఫార్ములాని ఫాలో కానున్నాడని వార్తలు విపిస్తున్నాయి. మహేష్‌బాబు కూడా ఈ మధ్య ఇదే తరహాలో తన సినిమాలకు వ్యవహరిస్తూ నిర్మాణ భాగస్వామిగా జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ని చూపిస్తున్నాడు. రాజమౌళి ప్రాజెక్ట్ విషయంలోనూ మహేష్ ఇదే పంథాను అనుసరిస్తాడా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.