Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ కళ్ళు తెరవాల్సిన టైమొచ్చిందా..??
By: Tupaki Desk | 31 May 2022 2:43 AM GMTకరోనా పాండమిక్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటంతో.. ఓటీటీలు వినోదం అందించే సాధనాలుగా మారిపోయాయి. ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్ ను ఇంటి వద్దనే చూసే అవకాశం ఉండటంతో.. అందరూ డిజిటల్ వేదికలకు అలవాటు పడిపోయారు. పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవడంతో.. ఇక థియేటర్లు మనుగడ సాధించడం కష్టమేనా అనే చర్చలు జరిగాయి.
వీటన్నింటినికీ సమాధానం చెబుతూ పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అయితే వాటి శాతం చాలా తక్కువ ఉంది. గత ఆరు నెలల్లో యాభైకి పైగా సినిమాలు రిలీజ్ అవ్వగా.. అర డజను సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అయితే వాటిల్లో కొన్ని కంటెంట్ బాగోలేక ప్లాప్ అయితే.. మరికొన్ని అధిక టికెట్ రేట్లు కారణంగానే పరాజయం పాలైనట్లు తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి ఇవ్వడంతో.. 'RRR' 'కేజీఎఫ్ 2' వంటి భారీ చిత్రాలను అధిక ధరలతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్ళు రాబట్టాయి. అదే రేట్లతో వచ్చిన 'రాధేశ్యామ్' (తెలంగాణ) - 'ఆచార్య' 'బీస్ట్' వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. 'సర్కారు వారి పాట' చిత్రానికి ఫుల్స్ పడకపోవడానికి కూడా టికెట్ ధరలు కారణమని తెలుస్తోంది.
మరోవైపు 'అఖండ' 'పుష్ప: ది రైజ్' 'బంగార్రాజు' 'డీజే టిల్లు' వంటి సినిమాలు తక్కువ టికెట్ రేట్లతోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దీనిని బట్టి లార్జర్ థెన్ లైఫ్ సినిమాలు చూడటానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్న ఆడియన్స్.. మిగతా చిత్రాలకు రేట్లు పెడితే థియేటర్ల వైపు చూడటం లేదని అర్థం అవుతుంది. అదే సమయంలో తక్కువ ధరలతో వచ్చిన చిత్రాలను ఆదరిస్తున్నారని విశ్లేషించవచ్చు.
ఈ నేపథ్యంలో సాదారణ టికెట్ ధరలతోనే రిలీజ్ చేస్తున్నామని చెబుతూ 'ఎఫ్ 3' చిత్రాన్ని గత శుక్రవారం థియేటర్లలోకి తీసుకొచ్చారు. అయితే రేట్లు తక్కువ అని నిర్మాతలు చెప్పారు కానీ.. ఇవి సామాన్యులకు మరీ అంత అందుబాటులో ఉండేవి ఐతే కాదు. ఇటీవల వచ్చిన ప్రభుత్వ జీవోల ప్రకారమే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల మాదిరిగా అదనపు రేట్లు పెంచలేదు అంతే. ట్యాక్సులు కలిపి చూసుకుంటే ఇవి కూడా భారంగానే ఉన్నాయి.
'ఎఫ్ 3' సినిమా ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. అయితే తక్కువ రేట్లతో రిలీజైన 'అఖండ' 'బంగార్రాజు' ఒపెనింగ్స్ తో పోల్చుకుంటే.. ఏమంత గొప్పగా లేవు. దీనికి కారణం టికెట్ రేట్లు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'ఎఫ్-3' సినిమా ప్రీ రిలీజ్ 80 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి వచ్చిన వసూళ్ళు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. ఈ రేట్లతో ఫ్యామిలీ ఆడియన్స్ రాబోయే రోజుల్లో ఏమేరకు థియేటర్లకు వస్తారనేది చూడాలి.
ఇటీవల విడుదలైన సినిమాలను పరిశీలిస్తే.. అధిక టికెట్ ధరల కారణంగా చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.. రిపీట్ ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. 'కేజీఎఫ్ 2' - RRR వంటి భారీతనం నిండిన లార్జర్ థెన్ లైఫ్ సినిమాలకు మాత్రమే జనాలు వస్తున్నారు. మిగతా సినిమాలను అంత రేటు పెట్టి చూడటానికి ఇష్టపడటం లేదనేది స్పష్టం అయింది.
ఎలాగూ మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుందిగా.. అప్పుడు చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికైనా అందరికీ అందుబాటులో ఉండే రేట్లు పెడితే మంచిదని సూచిస్తున్నారు.