Begin typing your search above and press return to search.
బాలయ్యను పట్టాలెక్కించడమంటే చిరూని పక్కన పెట్టడమేనా?
By: Tupaki Desk | 23 Jan 2022 9:30 AM GMTరచయితగా బీఏవీస్ రవికి మంచి పేరు ఉంది. ఇటీవల నటుడిగా కూడా స్పీడ్ పెంచుతూ వెళుతున్నాడు. 'ఆహా'లో 'అన్ స్థాప బుల్' టాక్ షోకి సంబంధించి ఆయన పార్టిసిపేషన్ ఉంది. ఈ షోను చిరంజీవితో కాకుండా, ప్రొఫెషనల్ గా రైవల్ కాంపౌండ్ కి చెందిన బాలకృష్ణతో ఈ షోను అల్లు అరవింద్ గారు చేయడం ఎలాంటి సంకేతాలను ఇస్తుందనుకోవాలి" అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అందుకు రవి మాట్లాడుతూ .. " ఇలాంటి ప్రయోగాలు చేయడమనేది అల్లు అరవింద్ గారికి అలవాటే. గీతా ఆర్ట్స్ పై ఆయన ఇంతకుముందు యార్లగడ్డ సుప్రియతో ఒక సినిమా చేశారు .. అది వేరే కాంపౌండ్ కదా.
అలాగే ఇంతకుముందు నాగేశ్వరరావుగారితో 'మెకానిక్ అల్లుడు' చేశారు. నాగచైతన్యతో '100% లవ్' చేశారు. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పెద్ద సంఖ్యలో వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారు. 'ఆహా'లో అల్లు అరవింద్ గారిది కీ రోల్ అయినప్పటికీ, ఆయన ఒక్కడే కాదు గదా. ఆయన ఒక ప్రధానమైన పార్ట్నర్ అంతే. అక్కడ అంతా కలిసే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అరవింద్ గారు నిర్మాత .. డిస్ట్రిబ్యూటర్ .. తండ్రి .. బావమరిది .. మేనమామ .. ఇన్ని వ్యాపారాలు .. వ్యాపకాలు ఉన్నాయి ఆయనకి.
అలాంటి ఆయనను ఒక కట్టప్పను చేసేయడం .. ఆయనను తక్కువ చేసినట్టుగా అనిపించింది నాకు. అల్లు అరవింద్ గారి కాంపౌండ్ లోనే పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు. అలాగే చిరంజీవి గారి కాంపౌండ్ ఎంత పెద్దదంటే వాళ్లంతా కూడా సెల్ఫ్ స్టైల్ తో ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నారు. అరవింద్ గారి కనుసన్నలలో కాకుండా వాళ్లంతా వాళ్ల పనులను చేసుకుంటున్నారు. అదలా ఉంచితే బాలకృష్ణగారి కుటుంబానికీ .. అరవింద్ గారి ఫ్యామిలీకి 40 ఏళ్ల నుంచి పరిచయం ఉందనే వాక్యంతోనే 'అన్ స్టాపబుల్' మొదలైంది.
బాలకృష్ణగారితో అల్లు అరవింద్ గారి ఈ షోను ఎనౌన్స్ చేసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఆ తరువాత నేను అరవింద్ గారు కలిసి 'భోళా శంకర్' షూటింగ్ ఓపెనింగ్ కి వెళ్లాము. చిరంజీవిగారికి తన ప్రతి సినిమా ఫస్టు డే కి అల్లు అరవింద్ గారితో కలిసి లంచ్ చేయడం అలవాటు. ఆ సమయంలో అక్కడ చాలామంది నిర్మాతలు ఉన్నారు. చిరంజీవిగారు .. అల్లు అరవింద్ గారు ఎప్పటిలానే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ షోకి బాలకృష్ణగారితో పాటు మరో ఇద్దరినీ అనుకోవడం జరిగింది. ఆ ఇద్దరూ ఎవరనేది మాత్రం ఇప్పుడు అప్రస్తుతం" అంటూ చెప్పుకొచ్చాడు.