Begin typing your search above and press return to search.
దళితులు సంగీతం నేర్వడం నేరమా?
By: Tupaki Desk | 3 March 2019 9:56 AM GMTదళితులు .. అగ్రవర్ణం విభేధాలు.. వివాదాస్పద ప్రేమకథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. గత రెండేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన మరాఠా చిత్రం `సైరాఠ్` దళిత- అగ్రవర్ణ కులాల గురించి.. ఇంటర్‌కాస్ట్ లవ్ స్టోరి గురించి తీసిన సినిమా. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం 100కోట్లు పైగా వసూలు చేసింది. అదే చిత్రాన్ని జాన్వీ - ఇషాన్ ఖత్తర్ జంటగా `ధడక్` పేరుతో కరణ్ జోహార్ నిర్మించారు. బాలీవుడ్ లోనూ సక్సెసైంది.
ఇంకాస్త వెనక్కి వెళితే టాలీవుడ్ లో దళితుల బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. మాదాల రవి విప్లవ కథాంశాల్లో దళితుడు, విప్లవకారుడు, బానిసత్వం, అణచివేత అన్న పాయింట్లు తప్పనిసరిగా ఉండేవి. నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణ మూర్తి సినిమాల్లో ఇది ఓ అండర్ కరెంట్ ఫ్యాక్టర్ గా రన్ అయ్యింది. అయితే వీటికి వేటికీ సంబంధం లేకుండా సంగీతం- మృదంగం నేపథ్యంలో దళితుల అంశాన్ని టచ్ చేస్తూ ఓ సినిమాని లెజెండరీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవన్ తెరకెక్కించారు. `సర్వం తాళమయం` పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ - గాయని అపర్ణ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రమిది. ఇది దళితవర్ణం పై తీసిన సినిమా కాదు. దళితులు అనే పాయింట్ ని టచ్ చేస్తూ తీసిన సినిమా అని నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన మీడియా సమావేశంలో రాజీవన్ వెల్లడించారు.
150 ఏళ్ల క్రితం కర్నాటక సంగీతాన్ని ఒకే కులం వాళ్లు నేర్చుకునేవారు. సంగీత విధ్వాంసులు అంటే వాళ్లు మాత్రమే అనుకునేవారు. కానీ కాలంతో పాటే మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యను కులమతాలతో సంబంధం లేకుండా అందరూ నేర్చుకుంటున్నారు. ఈ పాయింట్ ని టచ్ చేస్తూ `సర్వం తాళమయం` చిత్రాన్ని మృదంగం లెర్నింగ్ నేపథ్యంలో సంగీత ప్రధానంగా తెరకెక్కించామని తెలిపారు. మృదంగం చుట్టూ తిరిగే వైవిధ్యమైన కథాంశమిదని తెలిపారు. లెజెండరి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ & మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ మీనన్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి చిత్రాల తర్వాత 19ఏళ్లకు రాజీవన్ డైరెక్ట్ చేశారాయన. ఈ సినిమా మార్చి 8న తెలుగు రాష్ట్రాల్లో రిలీజవుతోంది. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో `సర్వం తాళ మయం` మీడియా సమావేశం నిర్వహించారు.