Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ బ్యూటీ ఆ రొమాంటిక్ హీరోతో ప్రేమలో పడిందా..!

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:30 PM GMT
బాలీవుడ్‌ బ్యూటీ ఆ రొమాంటిక్ హీరోతో ప్రేమలో పడిందా..!
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఈ మధ్య కాలంలో సినిమాలతో కన్నా ఇతర విషయాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ఆ మధ్య ఈ అమ్మడు ఒక ఈడీ కేసు నిమిత్తం వార్తల్లో నిలిచింది. ఒక వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ఈడీ ఆరోపించగా.. అతడితో జాక్వెలిన్‌ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అప్పట్లో ప్రధానంగా ప్రచారం జరగడంతో ఆమె గురించి పుకార్లు షికార్లు చేశాయి.

ఆ సమయంలో సినిమాల్లో ఆఫర్లు కూడా తగ్గాయి. మళ్లీ జాక్వెలిన్ సినిమాలతో బిజీ అవుతుంది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఈసారి ప్రేమ విషయమై మీడియాలో నిలిచింది. ఈ అమ్మడు తాజాగా హాలీవుడ్ నటుడు మిచెల్‌ మోరోన్ తో ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక మ్యూజిక్ ఆల్బంలో రొమాంటిక్ గా నటించడమే ఈ పుకార్లకు కారణంగా తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో 365 డేస్‌ అనే రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ అయిన విషయం తెల్సిందే. ఆ రొమాంటిక్ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న మిచెల్‌ మోరోన్‌ తో జాక్వెలిన్ కి మంచి జోడీ కుదిరింది. వీరిద్దరు కలిసి టోనీ కక్కర్‌.. నేహా కక్కర్ లు పాడిన మడ్ మడ్ కే సాంగ్ లో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వస్తున్నాయి.

మిచేల్‌ కొన్నాళ్ల క్రితం భార్య నుండి విడి పోయాడు. ఇద్దరు కలిసి జీవితం ను కొనసాగించలేం అనే నిర్ణయానికి వచ్చి ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఒంటరిగా ఉంటున్న మిచెల్ మోరోన్ ఇప్పుడు జాక్వెల్‌ తో వీడియో ఆల్బం చేసి ఆ వెంటనే ఆమెతో రియల్‌ లైఫ్‌ డ్యూయెట్ కూడా వేసుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్‌ అవుతున్న సమయంలో జాక్వెలిన్ తో ప్రేమాయణం గురించి మిచెల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను ఎవరితో ప్రేమలో లేను. నేను చాలా ఒంటరి జీవితం ను గడుపుతున్నాను.. పూర్తిగా నా దృష్టి కెరీర్‌ పైనే పెట్టాను అన్నాడు.

అయితే నిప్పులేనిదే పొగ రాదు అంటారు.. మరి ఆయన లేదని వారిస్తున్నా కొందరు మాత్రం ప్రేమ ఉందని బలంగా చెబుతున్నారు. ఏదైనా కొన్ని రోజుల్లో బయట పడాల్సిందే. మరి జాక్వెలిన్ ప్రేమాయణం త్వరలో బయట పడేనా చూడాలి.