Begin typing your search above and press return to search.
జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ముందుకొస్తుందా?
By: Tupaki Desk | 8 July 2022 5:30 PM GMTసౌత్ స్టార్ మేకర్స్ అంతా ఒక్కొక్కరుగా డ్రీమ్ ప్రాజెక్ట్ ల్ని తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' క్లైమాక్స్ లో ఉంది. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా మణిసార్ 'పొన్నియిన్ సెల్వన్' ని తెరకెక్కిస్తున్నారు.
ఎన్నో ఏళ్లగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని కలలు కంటున్నా? ఈ ఏడాది ఆ కల నెరవేరబోతుంది. ఈ సినిమా హిట్ తర్వాత మణిరత్నం కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారని అంచనాలున్నాయి. ఇక దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని సీన్ లోకి తెస్తోన్న సంగతి తెలిసిందే. అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ఎప్పటి నుంచో కల గంటున్నారు.
ఇప్పుడా డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే దిశగా పావులు కదుపుతున్నారు. పాన్ ఇండియాలో తెరక్కించి పాన్ వరల్డ్ కి రీచ్ అయ్యేలా? సినిమా చేయాలన్నది శంకర్ ప్లాన్ గా కనిపిస్తుంది. బాలీవుడ్-టాలీవుడ్-కోలీవుడ్ నిర్మాణ సంస్థల్ని ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేసి సినిమా చేయాలని భావిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్ర నిర్మాణం ఉంటుందని ప్రచారం సాగుతోంది.
ఇప్పుడిదే వేవ్ లో దర్శక శిఖరం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మరోసారి తెరపైకి వస్తోంది. జక్కన్న 'మహాభారతం' డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెరకెక్కించడానికి ఇప్పుడున్న తను అనుభవం సరిపోదు? అని ఇంకొంత అనుభవం సంపాదించిన తర్వాత మహాభారతం మొదలు పెడుతానని చాలా సందర్భాల్లో చెప్పారు.
మరి తాజా సన్నివేశాల నేపథ్యంలో జక్కన్న ఆలోచనలో మార్పు వచ్చిందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. మహాభారతం ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని జక్కన్న ఆలోచన చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇంకొన్నాళ్లు అగితే టెక్నాలజీ అప్ డేట్ అవుతుంది. దాంతో పాటు క్రియేటివిటీలోనూ మార్పులొస్తాయి. యంగ్ స్టార్స్ నుంచి పోటీని ఎ దుర్కోవాల్సి వుంటుంది.
ఇప్పటికే మహాభారతం చేయాలని కొంత మంది బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆలోచన చేస్తున్నారు. యంగ్ స్టార్స్ తో ఎంతో అప్ డేడ్ గా ఉంటున్నారు. ఇలా కొన్ని కారణాలు జక్నన్న పాత ఆలోచనలో కొత్త మార్పులు తీసుకొచ్చాయని తెలుస్తోంది. పైగా 2022 ఎరాలో ఒక్కొకరుగా డ్రీమ్ ప్రాజెక్ట్ ల్ని తెరపైకి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగానే మహాభారతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాజమౌళి -మహేష్ తో ఓ పాన్ ఇండియా సినిమా సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. అటుపై జక్కన్న మరో నాలుగు సినిమాలు చేస్తారుట. అవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలనీ..పూర్తిగా రీజనల్ సినిమాలేనని సమాచారం. వాటి తర్వాత 'మహాభారతం' సినిమాని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్లు క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. ఈ వ్యవధిలో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మహాభారతం కథ సిద్దం చేసే అవకాశం ఉంది.