Begin typing your search above and press return to search.
'RRR' ను జక్కన్న మరో నెల పొడిగిస్తున్నారా..?
By: Tupaki Desk | 30 March 2021 5:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'(రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనేక వాయిదాల తర్వాత ఫైనల్ గా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే జక్కన్న దీనికి తగ్గట్టుగా షూటింగ్ ప్లాన్స్ చేసుకున్నప్పటికీ అనేక కారణాలతో అనుకున్న సమయానికి చిత్రీకరణ జరగడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం కొత్తగా జూన్ నెలలో మరో 15 రోజులు షెడ్యూలు ప్లాన్ చేసారని వార్తలు వస్తున్నాయి.
'ఆర్.ఆర్ ఆర్' సినిమా టాకీ పార్ట్ మొత్తం మే నెల చివరికి కంప్లీట్ చేయాలని రాజమౌళి ముందుగా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకా కొంత భాగం చిత్రీకరణ పెండింగ్ పడేలా కనిపించడంతో షూటింగ్ ప్లాన్ మారి జూన్ నెల వరకు పొడిగించాల్సి వచ్చిందట. మే లోనే చిత్రీకరణ అయిపోతుందని భావించిన చరణ్ - తారక్ ఇద్దరూ తదుపరి కమిట్మెంట్స్ ని సెట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ మే ఎండింగ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అలానే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాలిటీ షో వ్యవహారాలు కూడా జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక శంకర్ తో సినిమాని వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో చరణ్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ పొడిగించడం అనేది హీరోలకు కాస్త ఇబ్బందే అనుకోవలేమో. కాకపోతే కోవిడ్ ఎఫెక్ట్ ఏమీ లేకపోతే డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇద్దరు హీరోలు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.