Begin typing your search above and press return to search.
'ప్రభాస్ 20' కోసం బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్...?
By: Tupaki Desk | 7 July 2020 11:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుండి ఇంతవరకు ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కూడా రివీల్ చేయకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో అసహనం నెలకొంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్ ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది మ్యూజిక్ కంపోజర్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.
ఇంతకముందు నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అమిత్ త్రివేది స్పందిస్తూ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ మూవీకి సంగీతం ఎవరు అందించబోతున్నారు.. 'సాహో'లాగే ఈ సినిమాకు కూడా అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో 'సాహా' సినిమాకి పలువురు సంగీత దర్శకులు వర్క్ చేసినట్లే ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తమిళ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి పనిచేయబోతున్నాడంటూ మరో న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంభందించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
ఇప్పుడు తాజాగా మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెరమీదకి వచ్చింది. బాలీవుడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ జూలియస్ ప్యాకియం ప్రభాస్20 కోసం వర్క్ చేయబోతున్నాడట. జూలియస్ ప్యాకియం బాలీవుడ్ లో 'ఏక్ థా టైగర్' 'ధూమ్ 3' 'కిక్' 'మర్దానీ' 'భజరంగీ భాయిజాన్' 'భాగీ' 'భాగీ 2' 'భాగీ 3' 'సుల్తాన్' 'హౌసుఫుల్ 4' వంటి సినిమాలకి వర్క్ చేశారు. ఇక తెలుగులో 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు జూలియస్ ప్యాకియం. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి జూలియస్ ఆల్రెడీ సైన్ చేసారని.. మ్యూజిక్ కంపోజిషన్ కూడా స్టార్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమాకి జూలియస్ ప్యాకియం కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ అందించనున్నారా లేదా సాంగ్స్ కూడా అందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.