Begin typing your search above and press return to search.

మ‌హేష్‌, చ‌ర‌ణ్, బ‌న్నీ ల‌కు భిన్నంగా ఎన్టీఆర్..

By:  Tupaki Desk   |   23 Dec 2022 7:53 AM GMT
మ‌హేష్‌, చ‌ర‌ణ్, బ‌న్నీ ల‌కు భిన్నంగా ఎన్టీఆర్..
X
టాలీవుడ్ టాప్ స్టార్ల‌లో అత్య‌ధికంగా రికార్డు స్థాయిలో విదేశాల‌కు వెకేష‌న్ ల‌కు వెళ్లే హీరోల్లో ఉందు వ‌రుస‌లో నిలుస్తుంటారు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు. ఆయ‌న త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా విదేశాల్లో ఫ్యామిలీతో ప్ర‌త్యేకంగా వెకేష‌న్ ల‌కు వెళ్ల‌డం.. అక్క‌డి వీధుల్లో ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా తిరుగుతూ కాల‌క్షేపం చేయ‌డం తెలిసిందే. ఈ ముగ్గురు స్టార్ లు వివ‌రామ స‌మ‌యాల్లో విదేశాల‌కు ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ కు వెళుతూ వుంటారు.

అందుకు సంబంధించిన ఫొటోల‌ని ప్ర‌త్యేకంగా అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటూ వుంటారు. అక్క‌డ ప్ర‌త్యేక ప్లేస్ ల‌లో విహ‌రిస్తూ క్యాప్చ‌ర్ చేసిన ఫొటోల‌ని షేర్ చేస్తూ త‌మ ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ వుంటారు. అయితే స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం వీరికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ ముగ్గురు స్టార్ హీరోల‌తో పోలిస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి విదేశాల్లో ప్ర‌త్యేకంగా ప‌ర్య‌టించ‌డం చాలా త‌క్కువ‌.

అంతే కాకుండా అలా వెకేష‌న్ కు వెళ్లిన ఫొటోల‌ని కూడా అభిమానుల‌తో పంచుకోవ‌డానికి ఎన్టీఆర్ పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ యుఎస్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యుఎస్ లో ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ అక్క‌డి వారి కంట‌ప‌డ‌కుండా, ఫొటోల‌కు చిక్క‌కుండా ప్రైవ‌సీని మెయింటైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో క‌లిసి ఓ రెస్టారెంట్ లో వున్న‌ ఓ ఫొటో తాఆజ‌గా బ‌య‌టికి వ‌చ్చేసి నెట్టింట తెగ వైర‌ల్ గా మారింది.

అక్క‌డున్న వాళ్ల‌ల్లో ఎవ‌రో క్లిక్ మ‌నిపించడంతో ఆ ఫొటో అయినా బ‌య‌టికి వ‌చ్చింది. లేదంటే ఎన్టీఆర్ ఆ ఫొటోని కూడా బ‌య‌ట‌కి రానిచ్చేవాడు కాదంట‌. త‌న స‌హ స్టార్స్ ఫ్యామిలీ వెకేష‌న్స్ కి సంబంధించిన ఫొటోల‌ని క్రేజీగా నెట్టింట షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే యంగ్ టైగ‌ర్ ఎందుక‌ని ప్రైవ‌సీని మెయింటైన్ చేస్తున్నాడ‌ని అంతా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 'RRR'తో వ‌ర‌ల్డ్ వైడ్ గా మంచి గుర్తింపుతో పాటు భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఎందుకు సీక్రెట్ గా వుండాలని బావిస్తున్నాడో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ట‌.

ఇదిలా వుంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో త‌న 30వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురానున్న ఈ మూవీ ప్ర‌క‌టించి నెల‌లు కావ‌స్తున్నా ఇంత వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌డం లేదు.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జ‌న‌వ‌రిలో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టి ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో వున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.