Begin typing your search above and press return to search.

పెళ్లి పిక్స్ అయిందని కాజల్ కంఫర్మ్ చేసినట్లేనా...?

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:31 PM GMT
పెళ్లి పిక్స్ అయిందని కాజల్ కంఫర్మ్ చేసినట్లేనా...?
X
దక్షిణాది అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి పీటలు ఎక్కుబోతున్నట్లు వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కానప్పటికీ.. ఈసారి ఇది నిజమే అని తెలుస్తోంది. ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అనే వ్యక్తిని కాజల్ వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ పెద్దల అంగీకారం మేరకు నిశ్చితార్థం కూడా పూర్తయిందని.. ముంబైలో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికీ.. చందమామ కాజల్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ నిజమేనేమో అనే అనుమానాలు కలిగిస్తోంది.

కాగా, ఈ రోజు ఉదయం నుంచి కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందనే న్యూస్ మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ ఇన్స్టా లో లవ్ సింబల్ ని పోస్ట్ చేసింది. దీనికి వైట్ కలర్ హార్ట్ ఎమోజీని క్యాప్షన్ గా పెట్టింది. ఈ ఎమోజీ హ్యాపీనెస్ - స్వచ్ఛత - లాయాలిటీ - నమ్మకాన్ని సూచిస్తుంది. దీంతో అమ్మడు పెళ్లి న్యూస్ ని కంఫర్మ్ చేసినట్లేనా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎలాగూ న్యూస్ బయటకు వచ్చింది కదా అని నెమ్మదిగా ఓపెన్ అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ న్యూస్ నిజమో కాదో అనే డౌట్ ఇంకా అభిమానుల మదిలో ఉన్నప్పటికీ ఆమె పోస్ట్ కి కామెంట్స్ రూపంలో విషెష్ చెప్తున్నారు. కాజల్‌ చెల్లెలు,హీరోయిన్ నిషా అగర్వాల్‌ ఏడేళ్ల కిత్రమే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, గౌతమ్‌ కిచ్లు ముంబైకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ మరియు వ్యాపారవేత్త. గతకొద్ది కాలంగా గౌతమ్‌ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్‌ లో ఉందని తెలుస్తోంది. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకొని టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఫాబ్‌ ఫర్నిష్‌ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన గౌతమ్.. 'ది ఎలిఫెంట్' అనే లైఫ్ స్టైల్ బ్రాండ్ కంపెనీకి సీఈఓగా కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 'డిస్కెర్న్ లివింగ్' అనే ఇంటీరియర్‌ డిజైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. మరి కాజల్ అగర్వాల్ ని చేసుకోబోయే అదృష్టవంతుడు గౌతమ్‌ కిచ్లు అవునో కాదో తెలియాలకంటే అమ్మడు అధికారిక ప్రకటన చేసే దాకా వెయిట్ చేయాల్సిందే.