Begin typing your search above and press return to search.
నందమూరి మంచోడి కథ ఇదేనా ?
By: Tupaki Desk | 23 Aug 2019 6:59 AM GMTశతమానం భవతికి నేషనల్ అవార్డు తేవడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవయ్యా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని షూటింగ్ కీలక భాగం పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పి యూనిట్ ఇటీవలే చిన్న షాక్ ఇచ్చింది. విపరీతమైన స్టార్ల పోటీ మధ్య కళ్యాణ్ రామ్ నిలుస్తాడా అనే చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం దీని కథకు గుజరాతిలో గత ఏడాది వచ్చిన ఆక్సిజన్ అనే సినిమా స్ఫూర్తి అని ఇన్ సైడ్ టాక్. అన్షుల్ త్రివేది హీరోగా చిన్మయ్ పురోహిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. చాలా హెవీ ఎమోషన్ తో అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది మన ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుందనే నమ్మకంతో సతీష్ వేగ్నేశ దీనికి చాలా కీలకమైన మార్పులు చేసుకున్నట్టు తెలిసింది.
కాకపోతే గుజరాతి వెర్షన్ చాలా లెంగ్త్ ఉంటుంది. అంతోఇంతో ఇదే కొంచెం మైనస్ గా నిలిచింది. అది దృష్టిలో పెట్టుకుని ఒరిజినల్ ఎమోషన్ ని మిస్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. తనకు కావాల్సిన వాళ్ళకే కాక అపరిచితులకు సైతం మంచి చేయాలని చూసే ఒక అతి మంచివాడి కథే ఈ ఆక్సిజన్. మన టైటిల్ చూస్తేనేమో దానికి సింక్ అవుతోంది. దర్శకనిర్మాతలు ఇది రీమేక్ అని చెప్పలేదు కాబట్టి ఇది అధికారికంగా ధృవీకరించలేం కాని ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగా సాగుతోంది