Begin typing your search above and press return to search.
కంగనా ఆవేశంతో ఆలోచన కోల్పోతున్నావా?
By: Tupaki Desk | 19 Sep 2020 7:15 AM GMTసినీ నటి కంగనా రనౌత్ ఈమద్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిది కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆమె బాలీవుడ్ ప్రముఖుల గురించి చేస్తున్న వ్యాఖ్యలు మరింతగా వివాదాస్పదం అవుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా చిన్న కామెంట్ చేసినా కూడా వెంటనే ఆమె చాలా సీరియస్ గా కౌంటర్ ఇస్తుంది. ఆవేశంతో కౌంటర్ ఇస్తున్న సమయంలో ఆమె ఆలోచన కోల్పోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె తాజాగా ఒక మీడియా రిపోర్టర్ పై చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. తప్పుడు కథనం ప్రసారం చేస్తావా నీపై లీగల్ చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించింది. అతడు ప్రసారం చేసిన కథనం నిజమే అంటూ నిరూపితం అవ్వడంతో తన ట్వీట్ ను డిలీట్ చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమద్య కాలంలో శివసేన కు ఓటు వేయాల్సి వచ్చింది. గత్యంతరం లేకపోవడం వల్లే వారికి ఓటు వేశాను. బీజేపీ మరియు శివ సేన పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో నా ఓటు ఉన్న నియోజక వర్గంలో బీజేపీకి కాకుండా శివసేనకు సీటు దక్కింది. అందు వల్ల నేను ఇష్టం లేకుండానే శివసేనకు ఓటు వేయాల్సి వచ్చిందని కంగనా చెప్పడం జరిగింది. అయితే ఈమద్య జరిగిన ఎన్నికల్లో శివసేన మరియు బీజేపీలు విడి విడిగానే పోటీ చేశాయి. కనుక బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉన్నా కూడా ఆమె శివసేనకు ఓటు వేసింది అంటూ ముంబయి తక్ మీడియా సంస్థ వార్తను ప్రసారం చేసింది.
ఆ వార్త కథనంపై సీరియస్ అయిన శివసేన తప్పుడు సమాచారం ఇస్తూ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై నేను కఠినంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. ఒక వేళ ఇలాంటి వారు మళ్లీ మళ్లీ పునరావృతం చేయకుండా ఉండాలంటే నేను వారికి శిక్ష పడేలా చేయాలనుకుంటున్నాను. వారు ఈ విషయాన్ని నిరూపించకుంటే పెద్ద సమస్యలో పడతారు అంటూ ట్విట్టర్ లో హెచ్చరించింది. అయితే కొంత సమయంకే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడంతో ఆ కథనం నిజమే అంటూ ఒప్పుకున్నట్లే కాదా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆవేశంలో మాట్లాడుతూ కొన్ని సార్లు కంగనా ఆలోచన కోల్పోతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.