Begin typing your search above and press return to search.
'కాంతార' కొత్త పాఠాలు నేర్పుతోందా?
By: Tupaki Desk | 19 Oct 2022 12:30 AM GMTకన్నడ సినిమా కొత్త పాఠాలు నేర్పుతోందా? అంటే అది సాధిస్తున్న విజయం అవుననే సంకేతాల్ని అందిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ పలు భాషల్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో పలువురు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే సినిమా అంటే భారీ సెట్టింగులు, సూపర్ స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్ ఎక్స్ వంటివే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయని సినిమా వాళ్లందరూ ఓ నిర్ణయానికి వచ్చిన వేళ ఎలాంటి అగ్రతారాగణం లేకుండా తెరకెక్కిన చిన్న చిత్రం `కాంతారా` భారీ చిత్రాల రికార్డ్స్ ని బ్రేక్ చేసి మేకర్స్ కి సరికొత్త పాఠాలు నేర్పుతోందని కామెంట్ లు చేస్తున్నారు.
శాండల్ వుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లోనూ `కాంతార` సంచలనాలు సృష్టిస్తోంది. ఇందులో నటించిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి పెద్ద స్టార్ కాదు. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లలో పెద్దగా పేరున్న వారు కూడా లేరు. భారీ సెట్ లు లేవు, భారీ బడ్జెట్ కూడా కాదు. కానీ బలమైన కథతో, అన్ని వర్గాల, భాషల ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఎమోషన్స్ తో ఈ మూవీని రూపొందించారు. అదే ఇప్పడు `కాంతార`ని దేశ వ్యాప్తంగా వైరల్ అయి సరికొత్త చర్చకు తెర తీసేలా చేస్తోంది.
మెగా బడ్జెట్ చిత్రాలు మాత్రమే జనాలను థియేటర్లకు జనాలని రప్పిస్తాయనే అపోహను తొలగించి సరికొత్త చర్చకు తెర తీస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అనూహ్య విజయం పలు ఇండస్ట్రీలకు పెద్ద గుణ పాఠంగా మారినట్టుగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ `కాంతార` టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా తరువాత ఒక సినిమా ప్రేక్షకుడు చూసే థోరణి మారిపోయింది.
గతంలో ఏ సినిమా గురించి పొగడ్తల వర్షం కురిపించని ప్రముఖులంతా `కాంతార`పై ప్రశంసలు కురిపిస్తుండటంతో సినిమా దేశ వ్యాప్తంగా చర్చినీయాంశంగా మారుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ తెలుగులో మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడంతో ట్రేడ్ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పక్కా కన్నడ నేటివిటీతో రూపొందిన ఈ మూవీ ఉత్తరాదిలోనూ సత్తా చాటుతూ భారీ వసూళ్ల దిశగా పయనిస్తోంది.
చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పలు ప్రశ్నలని సంధిస్తూ మేకర్స్ కి సరికొత్త పాఠాలు నేర్పుతుండటం విశేషం. భారీ స్టార్లుంటే.. తెలిసిన నటుడుంటేనే జనాలు సినిమాకు వస్తారనే ట్రెండ్ కు చరమగీతం పాగుతూ మనసుకు నచ్చే కథ, కదిలించే భావోద్యేగాలుంటే దాన్ని జనాలు నెత్తిన పెట్టుకుంటారని `కాంతార` మరో సారి నిరూపించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.