Begin typing your search above and press return to search.
కార్తీ కొత్త సినిమా.. ప్రభాస్ సినిమా లైన్ తోనే..
By: Tupaki Desk | 15 Aug 2022 12:30 AM GMTకోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలను కేవలం సొంత భాషలోనే రిలీజ్ చేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు సరిగ్గా మార్కెట్ లేకపోవడం వలన, మరికొన్ని సార్లు తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడం వలన అలాగే ఇతర పనుల ఆలస్యం కారణంగానో కొన్నిసార్లు ఈ హీరో తెలుగు మార్కెట్ ని మిస్ అవుతూ ఉంటాడు.
అయితే రీసెంట్గా వచ్చిన వీరుమాన్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ కాలేదు. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం అయితే డబ్బింగ్ పనులకు సమయం లేకపోవడం వలన తమిళంలో తొందరగా విడుదల చేయాలి అనే కారణం చేత తెలుగులో విడుదల చేయలేదు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఈ వారం పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. దీంతో వీరుమాన్ సినిమాకు భారీగా థియేటర్లు దొరికాయి.
జనాలకు కూడా పక్కా తమిళ సినిమా చూసి చాలా రోజులైంది కాబట్టి ఓపెనింగ్స్ అయితే భారీ స్థాయిలోనే వచ్చాయి. ఒక విధంగా కార్తీ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇక దర్శకుడు ముత్తయ్య ఈ సినిమాను ఎలా తెరపైకి తీసుకువచ్చాడు అనే వివరాల్లోకి వెళ్తే కంప్లీట్ గా ఈ సినిమా తమిళ్ నేటివిటీకి తగ్గట్టుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తలకెక్కించారు.
కొత్తదనం ఏమీ లేదు గతంలో ప్రభాస్ వంశీ పైడిపల్లి కలయికలో వచ్చిన మున్నా లైన్ తీసుకుని దర్శకుడు ముత్తయ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు.
తల్లి మరణానికి కారణం అయినా తండ్రి పై కొడుకు తీసుకునే రివెంజ్. అలాగే అతన్ని మార్చే హీరోయిన్. ఇక హీరో విలన్స్ యాక్షన్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఎప్పటిలానే హైలెట్ చేశారు. సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ కొన్ని యాక్షన్ ఎలివేషన్స్ తమిళ ఫ్లేవర్ కు తగ్గట్టుగా డ్రామా ఉండడంతో ఓపెనింగ్స్ అయితే బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమాను తెలుగులో ఓటీటీ లో అయినా విడుదల చేస్తారో లేదో చూడాలి.