Begin typing your search above and press return to search.

KGF 2 ఉత్త‌రాది నుంచి 500కోట్లతో విధ్వంశం?

By:  Tupaki Desk   |   2 May 2022 4:36 AM GMT
KGF 2 ఉత్త‌రాది నుంచి 500కోట్లతో విధ్వంశం?
X
KGF 2 సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఆరంభం మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు రాసినా కానీ అవేవీ కేజీఎఫ్ 2 హ‌వాని ఆప‌లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం అజేయంగా 1000 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికీ ఉత్త‌రాదిన తొలి వారం ఆడిన‌ట్టే ఆడుతోంద‌నేది ఒక రిపోర్ట్. ఇప్ప‌టికి 360కోట్లు కేవ‌లం ఉత్త‌రాది నుంచి వ‌సూలు చేసింది. అక్క‌డ రాకింగ్ స్టార్ య‌ష్‌ 500కోట్లు కొల్ల‌గొడ‌తాడా? అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ర‌షెస్ చూస్తే ఇదేమీ క‌ష్టం కాదంటూ బాలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది.

ఒక‌వైపు పోటీబ‌రిలో ఎన్ని హిందీ సినిమాలు రిలీజ‌వుతున్నా అవ‌న్నీ కేజీఎఫ్ 2 ముందు దిగ‌దుడుపేన‌ని ప్రూవ్ అవుతోంది. KGF: చాప్టర్ 2 (హిందీ) రూ. 360.31 కోట్ల మార్క్ ని అందుకోగా.. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన హీరో పంతి 2 మూడు రోజుల్లో కేవ‌లం 16 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. హీరో పంతి 2 కంటే అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన‌ రన్‌వే 34 బెట‌ర్ గా ఉంద‌ని టాక్‌.

యష్ నటించిన KGF: చాప్ట‌ర్ 2 (హిందీ) శనివారం నుంచి వ‌సూళ్ల ప‌రంగా మ‌రింత హైక్ కి వెళ్లింద‌ట‌. ప్రస్తుతం నడుస్తున్న చిత్రాలలో టాప్ వ‌సూళ్ల‌తో వీకెండ్ లో నంబ‌ర్ వ‌న్ చిత్రంగా నిలిచింది. టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి 2 - అజయ్ దేవగన్-అమితాబ్ బచ్చన్ రన్‌వే 34 ఈ వారంలో కొత్త విడుదలలు అయినప్పటికీ యష్ న‌టించిన కేజీఎఫ్ 2 మూడవ వారంలోను వాటిని మించి వ‌సూలు చేస్తోంది.

ఇది విధ్వంశ‌క‌ర విన్యాసం అంటూ బాలీవుడ్ మీడియాలు ఆకాశానికెత్తేస్తున్నాయి. కొత్త గా విడుదలైన వాటిలో ప్ర‌ముఖ స్టార్లు న‌టించినా కానీ ఆ ఛరిష్మా ఏదీ ప‌ని చేయ‌లేదు. ది కాశ్మీర్ ఫైల్స్- RRR (హిందీ)- KGF: చాప్టర్ 2 (హిందీ) ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో న‌డుస్తున్నాయి. బచ్చన్ పాండే- ఎటాక్ -యు జెర్సీ వంటి కొత్త విడుదలలు కేజీఎఫ్ హ‌వా ముందు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో తీవ్రంగా నష్టపోయాయని హిందీ బాక్సాఫీస్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

హీరోపంతి 2 ఈ ఆదివారం 4.5 కోట్లు వ‌సూలు చేయ‌గా.. KGF: చాప్టర్ 2 (హిందీ) పెరిగిన వ‌సూళ్ల‌తో సండే నాడు 7.25 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికి హిందీ బాక్సాఫీస్ నుంచి రూ. 360.31 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇదిలా ఉండగా దేవ‌గ‌న్ రన్‌వే 34 శనివారం నాడు వ‌సూళ్లలో వృద్ధిని కనబరిచింది. డే వైజ్.. కలెక్షన్లు రూ. 3.50 కోట్ల నుంచి రూ. 5.25 కోట్లకు పెరిగాయ‌ట‌. కానీ య‌ష్ సినిమా రోజుకు 8 కోట్లు వ‌సూలు చేస్తుంటే దేవ‌గ‌న్ - అమితాబ్ వంటి టాప్ స్టార్లు న‌టించిన సినిమా 5కోట్లు లోపు వ‌సూలు చేయ‌డం అది కూడా కొత్త రిలీజ్ కావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

దేవ‌గ‌న్ లు ఖాన్ లు కుమార్ లు టైగ‌ర్ లు రాకింగ్ స్టార్ య‌ష్ సినిమాని ప్ర‌భావితం చేయ‌లేర‌ని కూడా నిరూప‌ణ అయ్యింది. ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ ఫ్రాంఛైజీ హ‌వా మాస్ లో ఆ రేంజులో ఉంది మ‌రి. ఉత్త‌రాదిన ఈ విధ్వంశం ఇలానే కొన‌సాగితే 500కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ అన‌లిస్టులు విశ్లేషిస్తున్నారు.