Begin typing your search above and press return to search.

కియ‌రా-సిద్ధార్థ్ రిజిష్ట‌ర్ మ్యారేజ్ నిజ‌మా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 2:30 PM GMT
కియ‌రా-సిద్ధార్థ్ రిజిష్ట‌ర్ మ్యారేజ్ నిజ‌మా?
X
కియ‌రా అద్వాణీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభ‌మే మ‌హేష్- రామ్ చ‌ర‌ణ్.. అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని ఆర్.సి 15లో న‌టిస్తూ క్రేజీ బ్యూటీగా వెలిగిపోతోంది.

అయితే ఈ బ్యూటీ ఘాటు ప్రేమాయ‌ణం నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ముంబై మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడి పెంచుతున్నాయి. 2022 జ‌న‌వ‌రిలో సీక్రెట్ గా ప్రియుడు మ‌ల్హోత్రాతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన కియ‌రా ప‌లుమార్లు అత‌డి ఇంట్లోనే కెమెరా కంటికి చిక్క‌డంతో ముంబై మీడియా క‌థ‌నాలు వండి వార్చింది. ఎట్ట‌కేల‌కు త‌న ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాని పెళ్లాడేయ‌బోతోందంటూ మ‌రో క‌థ‌నం వేడెక్కిస్తోంది.

సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. అయితే 'కాఫీ విత్ కరణ్ 7'లో ఇదే ప్ర‌శ్న‌ అడిగినప్పుడు కియారా జ‌వాబు వేరుగా ఉంది. తాము స్నేహితుల కంటే ఎక్కువ అని మాత్ర‌మే చెప్పింది. అయితే ఎంత ఎక్కువ‌? అన్న‌దానికి స్ప‌ష్ఠ‌త నివ్వ‌లేదు. కియారాతో కలిసి షోలో కనిపించిన షాహిద్ కపూర్ ''ఈ సంవత్సరం చివరి నాటికి పెద్ద ప్రకటన వస్తుంది.. అది సినిమా కాదు.. నిజం!'' అంటూ క‌వ్వింపుగా అన్నారు. కియారా -సిద్ధార్థ్ పెళ్లిలో 'డోలా రే డోలా'కి డ్యాన్స్ చేస్తారని షాహిద్ - కరణ్ చర్చించుకున్నారు.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. వాటన్నింటిలో ఒక నిజం ఉందని తెలిసింది. కియారా - సిద్ధార్థ్ ఏప్రిల్ 2023లో వివాహం చేసుకోబోతున్నారు. ప్ర‌ఖ్యాత‌ బాలీవుడ్ మీడియా క‌థ‌నం ప్రకారం... ఈ జంట నిండా ప్రేమలో మునిగి ఉన్నారు. వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. సిద్ - కియారా ఇప్పుడు ఒకరినొక‌రు విడిచి ఉండ‌లేక‌పోతున్నారు.

వారి సంబంధం గురించి బహిరంగంగా చెప్పక‌పోయినా క‌లిసి ఉన్నార‌న్న‌ది నిజం అని చెబుతున్నారు. సిద్ధార్థ్ కుటుంబం ఢిల్లీలో ఉంది. పెళ్లి అక్క‌డే జరగనున్నందున బాలీవుడ్ నుండి ఎవరినీ పెళ్లికి ఆహ్వానించరు. ఈ జంట మొదట రిజిస్టర్ మ్యారేజీని చేసుకుంటారు. ఆ తర్వాత కాక్ టెయిల్ పార్టీ ఉంటుంది. రిసెప్షన్ ను భారీగా జరుపుకుంటారు. అయితే రిసెప్షన్ కు బాలీవుడ్ లోని వారి స్నేహితులను ఆహ్వానిస్తారా? ఢిల్లీకి పిలుస్తారా? అనేది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు.

'షేర్షా' ప్రమోషన్స్ లో ఆ ఇద్ద‌రినీ కలిసి చూసినప్పటి నుండి సిద్ధార్థ్ - కియారా మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని చ‌ర్చ సాగింది. కానీ కియారా 'కాఫీ విత్ కరణ్ 7'లో చూఛాయ‌గా ఒప్పుకుంది. ఈ చిత్రానికి చాలా ముందు నుండి తనకు సిద్ తెలుసు. వారు ఒక పార్టీలో కలుసుకున్నారు. ఈ జంట మొన్న‌ సోమవారం రాత్రి కూడా నిర్మాత అశ్విని యార్డి పుట్టినరోజు వేడుకలో జంట‌గానే క‌నిపించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.