Begin typing your search above and press return to search.

కియారా-సిద్దార్ద్ పెళ్లి చండీఘ‌ర్ లోనా?

By:  Tupaki Desk   |   8 Dec 2022 5:30 PM GMT
కియారా-సిద్దార్ద్ పెళ్లి చండీఘ‌ర్ లోనా?
X
బాలీవుడ్ ప్రేమ జంట‌ల‌న్ని వివాహ బంధంతో ఒక‌ట‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.  ఇదే ఏడాది విక్కీ కౌశ‌ల్- క‌త్రినాజంట పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ పెళ్లి పీఠ‌లెక్కారు. ఎవ్వ‌ర్ గ్రీన్ జంట అర్జున్ క‌పూర్-మలైక ఆరోరా కూడా ధాంప్య‌జీవితానికి  రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే వేడిలో  కియారా అద్వాణీ-సిద్దార్ధ్ మ‌ల్హోత్రా కూడా ఒక‌టి కాబోతున్నారని కొన్ని రోజులుగా మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడ‌క్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కొంత కాలంగా ఈ జంట పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. బంధాన్ని అధికారికం చేయలేదు గానీ..ఇరువురు చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతోన్న‌వైనం మాత్రం బాండింగ్ బ‌లాన్ని హైలైట్ చేస్తుంది. ఓ ర‌హాస్యాన్ని త్వ‌ర‌లో మీతో పంచుకోబోతున్నాని ఇటీవ‌లే కియారా అద్వాణీ ఓ హింట్ కూడా ఇచ్చింది. దీంతో  నిశ్చితార్ధానికి..పెళ్లికి క‌లిపి ముహూర్తం పెట్టేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

ఆ త‌ర్వాత వివాహ వేదిక‌గా గోవాని నిర్ణ‌యించిన‌ట్లు మీడియాలో వార్త‌లొచ్చాయి. కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే వివాహ వేడుక‌లో పాల్గొంటార‌ని..ఆ త‌ర్వాత ముంబైలో గ్రాండ్ గా రిసెప్షెన్ ఏర్పాట్లు ఉంటాయ‌ని బాలీవుడ్ లో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా వివాహ  వేద‌క‌ను మార్చిన‌ట్లు స‌మాచారం. సిద్దార్ధ్ పంజాబీ కుటుంబీకుడు కావ‌డంతో ఆ ర‌క‌మైన ఏర్పాట్లు చేసుకునేందుకు చండీఘ‌ర్ అయితేనే  అనూకూలంగా ఉంటుంద‌ని వేదిక‌ని అక్క‌డికి మార్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఈ మొత్తం వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే ఆ జంట రివీల్ చేయ‌నుంద‌ని స‌మాచారం. మ‌రి డైరెక్ట్ గా వెడ్డింగ్ కార్డుతో స‌ర్ ప్రైజ్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రు జంట‌గా  'షేర్ షా' సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టి నుంచి త‌రుచూ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం వృత్తి ప‌రంగా  ఇద్ద‌రు బాలీవుడ్ లో ఇద్దరు బిజీగా ఉన్నారు.  కియారా తెలుగులో  రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రంలో న‌టిస్తోంది. దీనికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా తో కియారా పాన్ ఇండియాల ఫేమ‌స్ కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.