Begin typing your search above and press return to search.

కియారా పెళ్లి క‌బురు తేదీ ఫిక్సైందా?

By:  Tupaki Desk   |   28 Nov 2022 5:02 AM GMT
కియారా పెళ్లి క‌బురు తేదీ ఫిక్సైందా?
X
బాలీవుడ్ ప్రేమ జంట‌ల‌న్ని వివాహ బంధంతో ఒక‌ట‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఏడాది విక్కీ కౌశ‌ల్- క‌త్రినాజంట పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ పెళ్లి పీఠ‌లెక్కారు. ఎవ్వ‌ర్ గ్రీన్ జంట అర్జున్ క‌పూర్-మైకా ఆరోరా కూడా ధాంప్య‌జీవితానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇదే వేడిలో కియారా అద్వాణీ-సిద్దార్ధ్ మ‌ల్హోత్రా కూడా ఒక‌టి కాబోతున్నారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

కొంత కాలంగా ఈ జంట పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. బంధాన్ని అధికారికం చేయలేదుగానీ..ఇద్ద‌రుచెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతోన్న‌వైనం మాత్రం బాండింగ్ బ‌లాన్ని హైలైట్ చేస్తుంది. జంట‌గా వెకేష‌న్స్ స‌హా ముంబై వీధుల్లో షికార్లు అన్ని ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అనే దానికి ఆస్కారం ఇచ్చారు.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ తో మ‌రోసారి ఆ విష‌యాన్ని బ‌ల‌ప‌రిచింది. తెర‌పై క‌వ్వించ‌డంలోనే కాదు..నిజ నీవితంలోనూ నేను చిలిపేన‌ని నిరూపించుకుంటాను అంటోంది. పాల నురుగ లాంటి దుస్తులు ధ‌రించి సిగ్గుల మొగ్గైంది. ఇక ర‌హాస్యాన్ని ఎక్కువ కాలం దాచ‌లేను. అతి త్వ‌ర‌లోనే డిసెంబ‌ర్ 2న ఓ విష‌యాన్ని వెల్ల‌డిస్తాను అని తెలిపింది.

అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయండి అంటూ రాసుకొచ్చింది. ఈ కామెంట్ లో అభిమానులు ఒక్క‌సారిగా స‌ర్ ప్రైజ్ అవుతున్నారు. సిద్దార్ధ్ మ‌ల్హోత్రాతో త‌న పెళ్లి విష‌యాన్ని ఆరోజు అధికారికంగా ప్ర‌క‌టిస్తుందంటూ సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రికొంత మంది సిద్దార్ధ్ త‌నకున్న రిలేష‌న్ షిప్ గురించి మాత్రమే రివీల్ చేయ‌డానికి అవ‌కాశం ఉందంటున్నారు.

మ‌రి ఈ చిలిపి వీడియో వెనుక సంగ‌తేంటో తెలియాలంటే? మ‌రో నాలుగు రోజులు ఆగితే స‌రి. ఇక బ్యూటీ కెరీర్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. హిందీలో బిజీ న‌టిగా న‌టిస్తోంది. విక్కీ కౌశ‌ల్ తో క‌లిసి న‌టించిన 'గోవింద నామ్ మేరా' రిలీజ్ కానుంది.

డిసెంబ‌ర్ 16న సినిమా రిలీజ్ కానుంది. ఈనేప‌థ్యంలో త్వ‌రలో ప్రారంభం కానున్న ప్ర‌చారం ప‌నుల్లో నిమ‌గ్నం కానుంది. అలాగే తెలుగులో పాన్ ఇండియా చిత్రం ఆర్సీ 16లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.