Begin typing your search above and press return to search.
తెలుగులో 'లస్ట్ స్టోరీస్' ఎప్పుడు చూపించబోతున్నారు...?
By: Tupaki Desk | 13 May 2020 11:30 AM GMTకరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలను.. సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. టీవీలలో ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సినిమాలను సీరియళ్లను ప్రోగ్రామ్స్ రిపీట్ చేస్తుండటంతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. జనాలు కూడా ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి.. ఒకవేళ కరోనా కంట్రోలై లాక్ డౌన్ ఎత్తేసినా కూడా జనాలు సినిమా థియేటర్స్ ఒకప్పటిలా వచ్చి ఎగబడి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. దీంతో రాబోయే రోజుల్లో కూడా వీటి హవా ఇలానే కొనసాగే అవకాశముంది. దీంతో మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను వదిలితే మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉన్న ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీస్ లను ఇష్టపడుతున్నారు. దీనికి ఉదాహరణగా ఇప్పటికే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న 'లస్ట్ స్టోరీస్'ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాక్ డౌన్ లో ఈ స్టోరీస్ ని విపరీతంగా చూసేస్తున్నారట.
వాస్తవానికి ఇండియన్స్ కి వెబ్ సిరీస్ మీద ఆసక్తి కలిగించేలా చేసింది మాత్రం 'లస్ట్ స్టోరీస్' అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గురించి సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసేలా చేసిందీ ఒరిజినల్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో అమ్మాయిల్లో ఉండే సెక్సువల్ డిస్‌ప్లెజర్ గురించి చాలా బోల్డ్‌గా డిస్కస్ చేశారు. మొత్తం నాలుగు భాగాలుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ని అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దివాకర్ బెనర్జీ, కరణ్ జోహర్ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే నటించిన సిరీస్ కు అనురాగ్ కశ్యప్, భూమి పడ్నేకర్ నటించిన సిరీస్ కు జోయా అక్తర్, మనీషా కోయిరాలా నటించిన సిరీస్ కు దివాకర్ బెనర్జీ, కియారా అద్వానీ నటించిన సిరీస్ కు కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్ లు ఎంత బోల్డ్ గా నటించారో తెలిసిందే.
ఇప్పుడు ఈ 'లస్ట్ స్టోరీస్'ని తెలుగులో నెట్ ఫ్లిక్స్ రీమేక్ చేస్తోంది. ఇందులో ఒక భాగాన్ని 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మిగతా మూడు భాగాల్ని నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్ ఇటీవలే పూర్తి చేశారు. ఇందులో కియారా అద్వానీ తరహా పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తున్నది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ టైములో ఈ తెలుగు 'లస్ట్ స్టోరీస్' తీసుకొస్తే సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ లో ఇలాంటి కంటెంట్ కి ఆదరణ లభిస్తోందని.. అందుకే తెలుగు 'లస్ట్ స్టోరీస్' త్వరగా ఓటీటీలో వదిలితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీల్లో వస్తున్న తెలుగు వెబ్ సిరీస్ లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయనే చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ నెట్ ఫ్లిక్స్ రేంజ్ కంటెంట్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి సమయంలో వదిలితే మంచి సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇండియన్ వెబ్ సిరీస్ లలో సంచలనం సృష్టించిన ఈ 'లస్ట్ స్టోరీస్' మన తెలుగులో ఎన్ని సంచలనాలకు తెరదీస్తుందో చూడాలి.