Begin typing your search above and press return to search.
ఆవిడకు గొడవ పెట్టుకోవడం అలవాటు!
By: Tupaki Desk | 16 Aug 2019 4:26 PM GMTపని చేయించుకుని పారితోషికం చెల్లించలేదని ఓ చిరుద్యోగి 2.0 నిర్మాతలపై ఫిర్యాదు చేయడం సంచలనమైంది. లైకా సంస్థ నుంచి తనకు రావాల్సిన పైకం ఇంకా అందలేదని అందుకోసం 10 నెలలుగా అలుపెరగని పోరాటం సాగిస్తున్నానని సబ్ టైటిలిస్ట్ రేఖ్స్ అలియాస్ రేఖ ఆరోపించడం కలకలం రేపింది.
లైకా అంతటి పెద్ద సంస్థ ఇలా ఓ చిరుద్యోగి పారితోషికం ఎగ్గొడుతుందా? అంటూ విస్తుపోతున్నారంతా. అయితే ఈ ఆరోపణల్ని లైకా సంస్థ ఓ ప్రకటనలో కొట్టిపారేసింది. రేఖకు ఇలా ఆరోపించడం ఇదే తొలిసారి కాదు. తాను ఏ నిర్మాణ సంస్థలో పని చేసినా వాటిపై ఇలానే ఆరోపించారు. తనకు పేమెంట్ చెల్లింపులు చేసిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి అని లైకా ప్రతినిధులు ప్రకటించారు. చేసిన పనికి తగ్గ చెల్లింపులు చేశాం. అంతకుమించి డిమాండ్ చేస్తోందని లైకా ప్రతినిధులు ప్రత్యారోపణలు చేశారు.
రేఖ గత హిస్టరీ తిరగేస్తే తాను పని చేసిన ప్రతి సంస్థతో గొడవ పడినట్టు ఆధారాలున్నాయని వివరాలు వెల్లడిస్తున్నారు. ఇదివరకూ దర్శకనిర్మాత గౌతమ్ మీనన్ తో.. కమల్ హాసన్... ఆస్కార్ రవిచంద్రన్ వంటి ప్రముఖులతోనూ రేఖ గొడవ పడిందని చెబుతున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన 2.0 ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల వసూళ్లు సాధించింది.