Begin typing your search above and press return to search.
షాకింగ్ : దుబాయ్ కి సౌత్ స్టార్ హీరో జంప్
By: Tupaki Desk | 25 Sep 2020 12:30 PM GMTఉద్యోగం చేసి బాగా సంపాదించాలంటే దుబాయ్ వెళ్లడం పాత పద్ధతి. ఇప్పుడు అక్కడే ఓ ఇల్లు కొనుక్కుని జంప్ అయిపోవడం కొత్త పద్ధతి. ఈ విధానానికి చాలా మంది సౌత్ నార్త్ సెలబ్రిటీలు అడిక్ట్ అయిపోతున్నారన్నది తాజా సమాచారం.
ఇలాంటి బ్యాచ్ లో బాలీవుడ్ ప్రముఖుల్లో కుమార్ సాను.. దలేర్ మెహెంది.. భూమిక భరత్ ఠాకూర్ సహా పలువురు హిందీ నటీనటులు ఉన్నారు. సోను నిగం వంటి బాలీవుడ్ గాయకులు ఇప్పటికే దుబాయ్ కు బేస్ మార్చారు. తాజా సమాచారం ప్రకారం.. దుబాయ్ లోని 5 నక్షత్రాల నివాసం పాలాజ్జో వెర్సేస్ లో మాధవన్ విశాలమైన ఆస్తిని కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈరోజుల్లో దుబాయ్ అన్నిటికీ అనుకూలమైనదిగా కనిపిస్తోందిట. చాలా మంది బాలీవుడ్ తారలు దుబాయ్ కు శాశ్వతంగా తరలి వెళుతున్నారు. మాధవన్ కూడా వారిలానే ఆలోచించాడట. ఇప్పుడు పూర్తిగా దుబాయ్ లో సెటిలైపోయాడు. ఇకపై అక్కడ నుండి సినిమాలకు పనిచేస్తాడు.
ఏడాది కాలంగా వీళ్లంతా దుబాయ్ చుట్టూ తిరుగుతుంటే ఏం జరుగుతోంది? అన్నది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మాధవన్ వ్యవహారంతో చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం దుబాయ్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతుంట మ్యాడీ అటువైపు షిఫ్టవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాధవన్ తదుపరి అనుష్క తో కలిసి `నిశ్శబ్ధం`లో నటించారు. అక్టోబర్ 2 న ప్రైమ్ వీడియోలో ఈ మూవీ వీక్షించే సదుపాయం ఉంది.