Begin typing your search above and press return to search.
మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడా?
By: Tupaki Desk | 17 Dec 2022 6:44 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న మంచు మనోజ్ వ్యక్తిగత కారణాల వల్ల భార్య ప్రణతి రెడ్డికి 2019లో విడాకులిచ్చేసి విడిపోవడం తెలిసిందే. అప్పటి నుంచి మానసికంగా ఒత్తిడికి గురవుతున్న మంచు మనోజ్ తను నటించాలని మొదలు పెట్టిన 'అహం బ్రహ్మస్మి' మూవీని కూడా ఆపేశాడు. దీంతో మనోజ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే శుక్రవారం కడప పెద్ద దర్గాని సందర్శించిన మంచు మనోజ్ మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తానంటూ ప్రకటించాడు. త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నానని మంచు మనోజ్ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే.
ఇదిలా వుంటే మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని, రాయలసీమకు చెందిన ప్రముఖ రాజకీయనేత, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె మౌనిక అంటూ గ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియా వేదికగా ఇటీవల మంచు మనోజ్, మౌనికల ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా వుంటే మంచు మనోజ్ బయట జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేయబోతున్నారని తెలుస్తోంది. మంచు మరనోజ్ ..రాజకీయనేత, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె మౌనిక ని వివాహం చేసుకోబోతున్నాడని, 2023 ఫిబ్రవరి 2న వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
మంచు మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండవ వివాహం. మౌనికకు మొదటి వివాహం కారణంగా ఓ కుమారుడు వున్నాడు. మనస్పర్థల కారణంగా మౌనిక తన భర్తతో విడిపోయిందట. ఆ తరువాతే మంచు మనోజ్ తో పరిచయం ఏర్పడిందని, ఇద్దరు కొంత కాలం చెన్నైలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు కలిసి హైదరాబాద్ లోనే వుంటున్నారట. ఇరువురి పెళ్లికి పెద్దలు అంగీకరించారా?.. పెళ్లి ముహూర్తం వారే నిర్ణయించారా? అన్నది తెలియాల్సి వుంది.
శుక్రారం మంచు మనోజ్ మాట్లాడుతూ త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని, కొత్త సినిమాలు మొదలు పెడతానని చెప్పడంలో ఆంతర్యం ఇదేననే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇండైరెక్ట్ గా మంచు మనోజ్ రెండో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని చెప్పకనే చెప్పడని అంటున్నారు. ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.