Begin typing your search above and press return to search.

'ధ‌మ్కీ'తో మాస్ కా దాస్ కెరీర్ రిస్క్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   19 Nov 2022 11:30 PM GMT
ధ‌మ్కీతో మాస్ కా దాస్ కెరీర్ రిస్క్ చేస్తున్నాడా?
X
కేవ‌లం 12 ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో రూపొందిన సినిమా 'వెళ్లిపోమాకే'..ఈ మూవీతో హీరోగా రంగ ప్ర‌వేశం చేసి హీరో విశ్వ‌క్ సేన్ ఆ త‌రువాత త‌రుణ్ భాస్క‌ర్ రూపొందించిన 'ఈ న‌గ‌రానికి ఏమైంది' సినిమాతో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఇది కూడా లిమిటెడ్ బ‌డ్జెట్ లో రూపొందిన సినిమానే. ఈ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కేలం రూ. 2 కోట్ల‌తో నిర్మించారు. ఆ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన 'హిట్' 6 కోట్ల‌తో నిర్మిస్తే 18 కోట్లు వ‌సూలు చేసింది.

ఇక్క‌డి నుంచే మాప్ కా దాస్ హంగామా మొద‌లైంది. 'హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌' కి ముందు విశ్వ‌క్ సేన్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన 'ఫ‌ల‌క్ నుమాదాస్‌' విశ్వ‌క్ క్రేజ్ ని, మార్కెట్ ని భారీగా పెంచేసింది. దాన్ని 'హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌' మ‌రో లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ త‌రువాత విశ్వ‌క్ సేన్ చేసిన ఏ సినిమా కూడా ప‌ట్టుమ‌ని ప‌ది కోట్ల బ‌డ్జెట్ ని మించ‌లేదు. కానీ 'ఓరి దేవుడా' త‌రువాత మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ త‌న కెరీర్ తో రిస్క్ చేస్తున్నాడ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

విశ్వ‌క్ సేన్ న‌టిస్తూ రూపొందిస్తున్న మూవీ 'దాస్ కా ధ‌మ్కీ'. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌ని బ‌డ్జెట్ తో ఈ మూవీని చాలా రిచ్ గా నిర్మించ‌న‌ట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైల‌ర్‌ ని సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీని భారీలావిష్ గానే నిర్మించ‌న‌ట్టుగా తెలుస్తోంది.

ప్ర‌తీ ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా కార్పొరేట్ క‌ల్చ‌ర్ నేప‌థ్యంలో సాగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. సినిమా కోసం విశ్వ‌క్ సేన్ భారీగానే ఖర్చు చేసిన‌ట్టుగా ప్ర‌తీ ఫ్రేమ్ స్ప‌ష్టం చేస్తోంది. త‌న మార్కెట్ ని మించి విశ్వ‌క్ సేన్ ఖ‌ర్చు చేసిన‌ట్టుగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో 'దాస్ కీ ధ‌మ్కీ' విశ్వ‌క్ సేన్ కెరీర్ కి అత్యంత కీల‌కంగా మారిన‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతే కాకుండా ఈ మూవీ ఫ‌లితం అటు ఇటైతే విశ్వ‌క్ సేన్ డైరెక్ష‌న్ ని కూడా వ‌దిలేసే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.