Begin typing your search above and press return to search.
మాస్ రాజా మరో 'సీక్వెల్'కు రెడీ అవుతున్నాడా..??
By: Tupaki Desk | 29 April 2021 1:30 AM GMTమాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా జోష్ తో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. అందరు హీరోలు కరోనా కారణంగా వెనకాముందు అవుతున్న తరుణంలో రవితేజ ధైర్యం చేసి క్రాక్ సినిమా విడుదల చేసాడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నాడు. ఖిలాడి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 28న విడుదల చేయనున్నట్లు ఇదివరకు మేకర్స్ తెలిపారు. కానీ సినిమా విడుదల సమయం దగ్గరపడితే గాని తెలియదు. ఎందుకంటే కరోనా భయంతో సినిమాలన్ని వాయిదా పడుతున్నాయి. మరి పరిస్థితులు సర్దుకుంటే మాత్రం రవితేజ సినిమా రిలీజ్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడని టాక్.
ఇదిలా ఉండగా.. మాస్ రాజాతో 'రాజా ది గ్రేట్' లాంటి సూపర్ హిట్ ఎక్స్పరిమెంటల్ మూవీ తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సినిమాలో రవితేజ క్యారెక్టర్ అంధుడే అయినప్పటికీ ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా రవితేజ మేనరిజమ్ ఎలివేట్ చేస్తూ హైలైట్ చేసాడు అనిల్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇటీవలే రవితేజను కలిసి అనిల్ స్టోరీ లైన్ వినిపించడం జరిగిందట. అయితే స్టోరీ నచ్చిన మాస్ రాజా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు అనిల్ ఎఫ్3 సినిమాతో, మరోవైపు రవితేజ ఖిలాడి, త్రినాథరావు సినిమాలతో బిజీ. మరి అసలు విషయం తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.