Begin typing your search above and press return to search.
మెగా 'లూసిఫర్' మళ్ళీ చేతులు మారబోతోందా..?
By: Tupaki Desk | 3 May 2021 10:33 AM GMTమలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటుండగా.. ఈ రీమేక్ మళ్ళీ చేతులు మారబోతోందని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి ఇమేజ్ ని మరియు మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు మోహన్ రాజా 'లూసిఫర్' స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. అయితే తెలుగు వాళ్లను దృష్టిలో పెట్టుకొని మోహన్ రాజా చేస్తున్న మార్పుల మీద చిరు అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఇప్పుడు ఈ రీమేక్ డైరెక్టర్ ని మార్చాలనుకుంటున్నాడని అనుకుంటున్నారు. నిజానికి మోహన్ రాజా మన నేటివిటీకి తగ్గట్టు కథలో చేసిన మార్పులు.. స్క్రిప్ట్ నేరేట్ చేసిన విధానం నచ్చడంతోనే ఈ ప్రాజెక్ట్ అతని చేతిలో పెట్టినట్లు చిరు వెల్లడించారు. అంతేకాదు నిర్మాతలు సైతం ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా సిద్ధం చేసారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శకుడిని మార్చాలని చూస్తున్నారనే వార్తలు నిజం కాకపోవచ్చని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం లేట్ అవుతుండటంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయా లేదా నిజంగానే డైరెక్టర్ ని మార్చాలని చూస్తున్నారా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే 'లూసిఫర్' రీమేక్ చిరంజీవి కెరీర్ లో రాబోతున్న 153వ సినిమా. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.