Begin typing your search above and press return to search.
JVAK సీక్వెల్ పై మెగాస్టార్ సైతం సీరియస్ గానే ఉన్నారా?
By: Tupaki Desk | 17 Aug 2022 2:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి-అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ హిట్ `జగదీక వీరుడు అతిలోకసుందరి` సీక్వెల్ తెరకెక్కించాలని ఉందన్న మనసులో కోర్కెను అశ్వీనిదత్ పలుమార్లు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నిర్మించిన `సీతారామం` సక్సెస్ అయిన నేపథ్యంలోనూ ఆ క్లాసిక్ గురించి దత్ స్పందించారు.
ఈ చిత్రాన్ని కేవలం మెగాస్టార్ వారసుడు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తప్ప ఇంకెవరితో చేసేది లేదని..తను మాత్రమే ఆ పాత్ర కు న్యాయం చేయగలరని మరోసారి మనసులో కోర్కెను బయట పెట్టారు. ఇందులో మెగాస్టార్ ని సైతం భాగం చేయాలని పెద్దాయన భావించారు. అయితే ఆ బాధ్యతలు ఇప్పటికే యంగ్ మేకర్ నాగ్ అశ్వీన్ తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది.
గతంలో ఇదే సీక్వెల్ ని చిరంజీవితో తెరకెక్కించాలని నాగ్ అశ్విన్ కథా చర్చలు జరిపినట్లు కూడా మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఆ కథ చిరుకు నచ్చకపోవడంతో అక్కడితో బ్రేక్ పడింది. ఆ తర్వాత చిరు వేర్వేరు సినిమాలతో బిజీ అవ్వడం..నాగ్ అశ్విన్ ప్రభాస్తో ప్రాజెక్ట్ -కెలో తలమునకల్వడంతో తాత్కాలికంగా ఆ సీక్వెల్ కథాకమామీషు అక్కడితో ముగిసింది.
అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. మెగాస్టార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పుడా బాద్యతలు వేరే దర్శకుడికి అప్పగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మాతృకకు అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. కానీ ఇప్పుడా బాద్యతలు ఆయన తీసుకోలేరు. ఇప్పటి జనరేషన్..నేటివిటీకి తగ్గట్టు టెక్నికల్ గా సీక్వెల్ ని తెరకెక్కించాల్సి ఉంటుంది. టెక్నికల్ గా సినిమాని నెక్స్ట్ లెవల్ లో చూపించాలి.
ఇవన్నీ సాంకేతిక విషయాలపై పట్టున్న దర్శకుడు అయితేనే ఆసీక్వెల్ కి న్యాయం చేయగలడు. ఈ నేపథ్యంలో చిరంజీవి అలాంటి మేకర్ అన్వేషణలో ఉన్నట్లు తెలిసింది. చిరంజీవికి అలాంటి విజన్ ఉన్న దర్శకుడు దొరికితే దత్ తో సినిమా చేయాలని ఎగ్జైట్ మెంట్ తో ఉన్నట్లు లీకులందతున్నాయి. అయితే అందుకు నాగ్ అశ్విన్ సమర్ధుడే.
`మహానటి` తర్వాత పాన్ ఇండియాలో `ప్రాజెక్ట్ -కె` లాంటి టెక్నికల్ స్టాండర్స్డ్ మూవీ చేస్తున్నారు. ఇప్పుడున్న మేకర్స్ లో రాజమౌళి తర్వాత అంతటి ప్రతిభావంతుడిగా అతని పేరు వినిపిస్తుంది. కానీ చిరు మైండ్ లో ఆ యువ మేకర్ కి బధులుగా కొత్త వాళ్లు రావడం అన్నదే ఆసక్తికరంగా మారింది.