Begin typing your search above and press return to search.
'మాన్ స్టర్' టైటిల్ ఎవరిది?. రాజశేఖర్ ది కాదా?
By: Tupaki Desk | 24 Aug 2022 11:32 AM GMTగత కొన్నేళ్లుగా మూవీ టైటిల్స్ వివాదం టాలీవుడ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్ ఖలేజా నుంచి కల్యాణ్ రామ్ కత్తి, రవితేజ నిప్పు వరకు ప్రతీ టైటిల్ చుట్టూ వివాదం నడిచింది. తాఆజగా అలాంటి వివాదామే డా. రాజశేఖర్ సినిమా చుట్టూ తిరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. యాంగ్రీ యండ్ మెన్ డా. రాజశేఖర్ ఇటీవలే 'శేఖర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రాంగ్ టైమ్ రిలీజ్ కావడంతో ఈ మూవీకి ఆశించిన స్థాయి ఆదరణ దక్కలేదు.
పైగా టేకింగ్, మేకింగ్ లోనూ నాణ్యతలేకపోవడంతో ఈ మూవీ కాస్తా రాజశేఖర్ కు దారుణ ఫలితాన్ని అందించింది. దీంతో కొంత విరామం తీసుకున్న రాజశేఖర్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ మూవీకి 'మాన్ స్టర్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. బుధవారం టైటిల్ ని కూడా చిత్ర బృందం ప్రకటించింది.
అయితే ఈ టైటిల్ ఇప్పుడు వివాదంలో పడిందని తెలుస్తోంది. ఇదే టైటిల్ ని అంతకు ముందే యంగ్ హీరో 'హ్యాపీడేస్' ఫేమ్ వంశీ చాగంటి రిజిస్టర్ చేయించుకున్నాడట. ఇదే టైటిల్ తో తాజాగా మంగళవారం టైటిల్ పోస్ట్ ని వదిలాడు.
పద్మ ఇరువంటితో కలిసి వంశీ చాగంటి నిర్మిస్తున్న ఈ మూవీకి ఐతరాజు వేద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పడు ఇద్దరిలో ఎవరు టైటిల్ విషయంలో తగ్గుతారు? .. ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.
వంశీ చాగంటి నటిస్తున్న 'మాన్ స్టర్' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు రెండు సినిమాలకు టైటిల్ సమస్యగా మారింది. 'మాన్ స్టర్' టైటిల్ ముందు షూటింగ్ పూర్తి చేసుకున్న వంశీ చాగంటిదా? .. లేక ఇప్పడే సెట్స్ పైకి వెళ్లిన డా. రాజశేఖర్ దా? అనేది తేలాల్సి వుంది.
గతంలో ఇదే తరహాలో టైటిల్ వివాదం కావడంతో 'ఖలేజా' సినిమాకు మహేష్ ఖలేజా అని, నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు నానీస్ గ్యాంగ్ లీడర్ అని కత్తి సినిమాకు కల్యాణ్ రామ్ కత్తి అని టైటిల్స్ మార్చేసి రిలీజ్ చేసేశారు. కొంత మంది మాత్రం పూర్తిగా టైటిల్స్ ని మార్చేసి కొత్త టైటిల్ తో థియేటర్లలోకి వదిలారు. మరి ఈ రెండు సినిమాల్లో 'మాన్ స్టర్' టైటిల్ డా. రాజశేఖర్ వదులుకుంటాడా? లేక వంశీ చాగంటి వదులుకుంటాడా? అన్నది వేచి చూడాల్సిందే.