Begin typing your search above and press return to search.
దిల్ రాజు కు మైత్రీ వారు చెక్ పెడుతున్నట్టేనా?
By: Tupaki Desk | 30 Dec 2022 5:51 AM GMTదిల్ రాజు.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు లేరు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గానూ గత కొంత కాలంగా ఈ రెండు రంగాల్లోనూ దిల్ రాజు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తిరుగులేదు. నైజాం ఏరియాలో స్టార్ హీరో సినిమాని రిలీజ్ అంటే అది దిల్ రాజు చేయాల్సిందే. ఇది గత కొంత కాలంగా జరుగుతోంది. అయితే ఈ సంప్రదాయానికి ఈ సంక్రాంతితో బ్రేక్ పడుతోందా? .. దిల్ రాజు హ్యాండ్ లేకుండానే బిగ్ స్టార్స్ నటించిన రెండు సినిమాలు పొంగల్ బరిలోకి దిగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మెగాస్ఠార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'వాల్తేరు వీరయ్య'. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు వింటేజ్ లుక్ లో 'ముఠామేస్త్రీ' టైమ్ ని గుర్తు చేస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో మోతెక్కిస్తోంది మైత్రీ సంస్థ.
ఇక ఇదే సంస్థ నందమూరి బాలకృష్ణతో 'వీర సింహారెడ్డి' మూవీని నిర్మిస్తోంది. గోపీచంద్ మలినపేని దర్శకుడు. ఇందులో బాలయ్య డ్యుయెల్ రోల్ లో పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందులో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే లిరికల్ వీడియోలతో ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సపినిమాలని మైత్రీ వారే స్వయంగా రిలీజ్ చేస్తుండటం గమనార్హం. ఇటీవల నైజాం లో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ తో కలిసి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌ని ఏర్పాటు చేసిన మైత్రీ వారు తాము నిర్మిస్తున్న బారీ సినిమాలని స్వయంగా రిలీజ్ చేసుకుంటున్నారు.
ఇది నైజాంలో దిల్ రాజుకు తగులుతున్న బిగ్ షాక్ అనే చర్చ జరుగుతోంది. దీనిపై ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇండైరెక్ట్ గా మైత్రీ వారి వల్ల తాను హార్ట్ అయినట్టుగా వెల్లడించినట్టు తెలుస్తోంది. మైత్రవీరాఉ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ని మొదలు పెట్టడం శుభ పరిణామమే అని చెప్పుకొచ్చినా లోలోన మాత్రం దిల్ రాజు ఫీలవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా మైత్రీ వారు సినిమాల నిర్మాణం చేపట్టిన దగ్గరి నుంచి తనకే సినిమాలు ఇస్తూ వస్తున్నారని, వారితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అలా అయితే తనకు 'ఉప్పెన' తరువాత సినిమాలు ఇచ్చేవారు కాదని దిల్ రాజు అన్నారట. ఇక కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన మైత్రీవారు రిలీజ్ చేస్తున్న రెండు భారీ సినిమాలతో ఈ రంగంలో వున్న ఇబ్బందులేటో వారికి తెలిమయదని, ఏడాది తరువాతే ఆసలు విషయం బోధపడుతుందని దిల్ రాజు సెటైర్లు వేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.