Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ నాటు సాంగ్ కాపీయా... ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 7:40 AM GMT
ట్రిపుల్ ఆర్ నాటు సాంగ్ కాపీయా... ?
X
ట్రిపుల్ ఆర్ టాలీవుడ్ లో ప్రెస్టేజియస్ మూవీగా ఉంది. మూడేళ్ల సుదీర్ఘమైన ప్రస్థానం ఈ మూవీది. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ ని రెండు పార్టులుగా తీసి వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన రాజమౌళి తరువాత సినిమా అంటే యావత్తు దేశమంతా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఇక టైమ్ కుదిరింది ముహూర్తం కూడా బాగుంది. దాంతో ట్రిపుల్ ఆర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్ వర్క్ కూడా అదిరిపోయే రేంజిలో సాగుతోంది. ట్రిపుల్ ఆర్ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా రీసౌండ్ చేస్తోంది. లేటెస్ట్ గా వచ్చిన నాటు సాంగ్ పాత రికార్దులను బ‌ద్ధలు కొట్టేల వ్యూస్ తో సాగుతోంది.

ఇదిలా ఉంటే ఈ నాటు సాంగ్ మీద అపుడే నెట్టింట ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కంప్లీట్ గా ఆఫ్రికన్ మూవీ నుంచి మక్కీ టూ మక్కీ కాపీ కొట్టేసిన సాంగ్ అంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే సాగుతోంది. అనుకూల ప్రతికూల కామెంట్స్ తో అటూ ఇటూ అదరగొడుతున్నారు. ఇంతకీ నాటు సాంగ్ మూలమైన ఆఫ్రికన్ సాంగ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ కూడా ఇద్దరు నటులు ఇదే రకంగా కాస్ట్యూమ్స్ వేసుకుని ఒకే తీరున స్టెప్స్ వీర లెవెల్లో వేస్తారు. దాంతో ఆఫ్రికన్ మూవీ సాంగ్ క్లిప్పింగ్స్ పెట్టి మరీ నెట్లో రాజమౌళి నాటు సాంగ్ ని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు.

రాజమౌళి ఇలాగే గతంలో కూడా అనేక విషయాల్లో కాపీ చేశాడంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన నాని హీరోగా పెట్టి తీసిన ఈగ మూవీ కూడా కాక్రోచ్ అనే మూవీకి కాపీ అంటూ పాత విషయాలు కొత్తగా కెలుకుతున్నారు. ఇక బాహుబలి మూవీ పోస్టర్ కూడా ఒక ఇంగ్లీష్ మూవీ పోస్టర్ కి కాపీ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఎలాగోలా రాజమౌళి కరోనా రెండు స్టేజీలలోనూ రిస్క్ ని సైతం ఫేస్ చేసి ట్రిపుల్ ఆర్ మూవీని బయటకు తెచ్చాడు. మల్టీ స్టారర్ కోసం వాచిపోయిన సినీ జనాలకు భారీ ఐ ఫీస్ట్ కి కావాల్సిన సరంజామా అంతా రెడీ చేసి పెట్టాడు. ఇపుడు ఎక్కడ చూసినా నాటు సాంగ్ మీద హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ సిట్యువేషన్ లో ఆ సాంగ్ కాపీ అంటూ లేవనెత్తిన వివాదం ఏ విధంగా సాగుతుంది, ఏం జరుగుతుంది అన్నదే చూడాలి. మొత్తానికి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ట్రిపుల్ ఆర్ కి వస్తున్న పెద్ద ఎత్తున ప్రచారమే బ్లాక్ బస్టర్ అయ్యేందుకు తొలి మెట్టు అంటున్నారు అంతా.