Begin typing your search above and press return to search.
మెగా బ్రదర్ 'మా' వివాదాన్ని మళ్లీ కెలుకుతున్నారా?
By: Tupaki Desk | 31 Oct 2022 3:30 PM GMTమెగా బ్రదర్ 'మా' వివాదాన్ని మళ్లీ కెలుకుతున్నారా? అంటే తాజాగా ఆయన వెల్లడించిన మాటలని బట్టి చూస్తుంటే అదే అని స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. చాలా రోజుత తరువాత 'మా'వివాదంపై, సీనియర్ నటుడు నరేష్ పై మెగా బ్రదర్ నాగబాబు నిప్పులు చెరిగారు. ఈ మధ్య చాలా విషయాలపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తూ సంచలనంగా మారుతున్న నాగబాబు తాజాగా ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మా' అసోసియేషన్ పై, సీనియర్ నటుడు నరేస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
గత ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఆయనకు పోటీగా మంచు విష్ణు తన ప్యానల్ తో పోటీపడ్డారు. ఇద్దరి ప్యానల్ ల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. అయితే లోకల్ నాన్ లోకల్ వివాదం తెరపైకి రావడంతో చాలా వరకు సభ్యులు మంచు విష్ణు వైపు మొగ్గుచూపడంతో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. అయితే ఆయన ప్యానల్ నుంచి పోటీకి దిగిన సభ్యులు చాలా వరకు విజయం సాధించారు.
అయితే ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా ఓడిపోవడం, 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన ప్యానల్ లో పోటీచేసిన వారు కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుంటే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో 'మా' అసోసియేషన్ పై, సీనియర్ నటుడు నరేస్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన దగ్గరి నుంచి అంత చేతకాని, లిటిగేషన్స్ వున్న ప్రెసిడెంట్ ని చూడలేదన్నారు.
అంతే కాకుండా తను మా అసోసియేషన్ కు ప్లస్ కాకపోయినా ఫరవాలేదు కానీ మైనస్ అయిపోయాడు. ఏం జరిగినా ప్రెస్ మీట్ లు పెట్టడం చేశాడు. అది ప్రజలకు అవసరం లేని మ్యాటర్. కానీ తను మాత్రం కావాలనే ప్రెస్ మీట్ లు పెట్టి మరీ కంపు చేశాడు. ఆ తరువాత మాకు మరో దారి లేకపోవడంతో స్పందించాల్సి వచ్చిందన్నాడు.
నాకు తెలిసినంత వరకు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం మోహన్ బాబు గారికి, విష్ణు కి లేదని నా ఉద్దేశ్యం. కానీ వాళ్లకు లేనిపోనివి చెప్పాడని మాకు సమాచారం ఉంది. మళ్లీ నరేష్ తన కెపాసిటీకి మించి ఆలోచిస్తాడు. తాను దైవాంశ సంభూతుడిననే భ్రమలో వుంటాడు. అందుకే తను శ్రీకృష్ణుడి పాత్ర చేసి చక్రం తిప్పాననడం అతనికి అదొక రకమైన మానసిక జబ్బు అన్నారు నాగబాబు.
నరేష్ తనని తాను ఇష్టపడతాడు. శివాజీ రాజాపై అనవసరంగా గోల చేశాడు. తర్వాత జీవితను కలుపుకుని వెళ్లాడు.. ఇప్పడు తనతో కూడా గొడవ పడటం మొదలు పెట్టాడు. నరేష్ గొడవలు క్రియేట్ చేసి తనకు తాను ఇండస్ట్రీ పెద్దగా మారాలనుకున్నాడు. కానీ ఏదీ జరగలేదు అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.