Begin typing your search above and press return to search.
చైతూ కాలేజ్ డేస్ లోనే లవ్ చేశాడా...?
By: Tupaki Desk | 28 Jun 2022 4:56 AM GMTనాగ చైతన్య ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. సమంత నుండి విడాకులు తీసుకున్న నాగచైతన్య ప్రస్తుతం హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమలో ఉన్నాడు అంటూ గత కొన్ని రోజులు గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఆ వార్తలకు ఖండన రాలేదు కనుక శోభిత.. చైతూ వార్తలు నిజమేనేమో అంటూ అభిమానులు ఒక అభిప్రాయం కు వచ్చేస్తున్నారు.
సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య ప్రస్తుతం శోభిత తో ప్రేమలో ఉన్నాడు అనే విషయం ఫ్యాన్స్ లో ఓ రేంజ్ చర్చకు తెర తీస్తూ ఉంటే మరో వైపు నాగ చైతన్య కాలేజ్ రోజుల్లోనే ప్రేమలో పడ్డాడా అంటూ కొత్త ప్రచారం మొదలు అయ్యింది. నాగ చైతన్య తాజా చిత్రం థాంక్యూ ప్రమోషన్ లో భాగంగా తన ఫస్ట్ లుక్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు.
హైదరాబాద్ లోని ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో థాంక్యూ సినిమా లోని ఒక పాట ను విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో నాగ చైతన్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను కాలేజ్ లో ఉన్న రోజుల్లో ఎప్పుడెప్పుడు కాలేజ్ నుండి బయటకు వెళ్దామా.. ఎప్పుడెప్పుడు కెరీర్ లో సెట్ అవుదామా.. ఎప్పుడెప్పుడు తన ప్రేమ గురించి ఇంట్లో చెబుదామా అని ఎదురు చూసేవాడిని అన్నాడు.
కాలేజ్ పూర్తి అయ్యి సెటిల్ అయిన తర్వాత ప్రేమ గురించి చెప్పాలని నాగ చైతన్య కాలేజ్ లో ఉన్నప్పుడే అనుకున్నాడు అంటే అప్పట్లోనే నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లే కదా అంటూ కొందరు సోషల్ మీడియాలో పాయింట్ పట్టుకున్నారు. నాగ చైతన్య వ్యాఖ్యలు మరియు ఆయన ఉద్దేశ్యం విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.
ఆయన మామూలుగానే అన్నాడా లేదంటే కాలేజ్ రోజుల్లో ప్రేమలో ఉన్నాడా అనే విషయం క్లారిటీ రావాలి అంటే మళ్లీ ఆ విషయమై చైతూ స్పందించాల్సి ఉంది. ఇక థాంక్యూ సినిమా విషయానికి వస్తే కాస్త ఆలస్యంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించాడు.